గుండెల్ని పిండేస్తున్న సమంత రిలీజ్‌ చేసిన ట్రైలర్‌..

By Aithagoni Raju  |  First Published Nov 4, 2023, 8:13 PM IST

సమంత తాజాగా `సప్త సాగరాలు`(సైడ్‌ బీ) చిత్ర ట్రైలర్ ని విడుదల చేసింది. రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో అది హైలైట్‌గా నిలుస్తుంది.


సమంత మళ్లీ యాక్టివ్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలోనే కాదు, బయట కూడా ఆమె సందడి చేస్తుంది. ఇటీవల మార్వెల్‌ ప్రొడక్షన్‌ కోసం వచ్చింది. ఇప్పుడు కన్నడ స్టార్‌ రక్షిత్‌ శెట్టికి తన వంతు సపోర్ట్ అందించింది. ఆయన హీరోగా నటించిన `సప్తసాగరాలు దాడి` మూవీ ట్రైలర్‌ని రిలీజ్‌ చేసింది. అంతేకాదు ట్రైలర్‌కి ఫిదా అయ్యింది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ కూడా ఆకట్టుకుంటుంది. ఆద్యంతం పొయెటిక్‌గా సాగే ఈ ట్రైలర్‌ ఆడియెన్స్ హృదయాలను కదిలిస్తుంది. 

ఇప్పటికే `సప్తసాగరాలు దాడి`(సైడ్‌ ఏ) విడుదలై ఆకట్టుకుంది. ఓ ఫ్రెష్‌ లవ్‌ స్టోరీగా, ఓ పొయెటిక్‌ లవ్‌ స్టోరీగా మెప్పించింది. ఇప్పుడు `సైడ్‌ బీ` అంటూ రెండో భాగాన్ని విడుదల చేశారు. మొదటి భాగంలో హీరో జైల్లో మగ్గిపోతాడు, దీంతో హీరోయిన్‌ మరో పెళ్లి చేసుకుంటుంది. దీంతో వీరి ప్రేమ కథ విషాదంగా ముగుస్తుంది. రెండో భాగంలో జైలు నుంచి బయటకొచ్చిన హీరో ఎలాంటి సంఘర్షణ ఫేస్ చేశాడనేది చూపించారు. ఆమె పంపిన క్యాసెట్‌లో రెండో వైపు చెప్పిన మాటలను రీకాల్‌ చేస్తూ ట్రైలర్‌ సాగింది. గుండెల్ని పిండేసేలా ఈ మాటలుండటం విశేషం. ఆ మాటలు వింటుంటేనే హార్ట్ ని టచ్‌ చేస్తున్నాయి. ఆ ప్రేమ మైకంలోకి తీసుకెళ్తున్నాయి. ఆద్యంతం ఎమోషనల్‌గా, ఆద్యంతం ఫీల్‌గుడ్‌గా ఈ ట్రైలర్‌ సాగింది. సినిమాపై మరింతగా అంచనాలను పెంచింది. 

Latest Videos

అయితే `సప్తసాగరాలు దాటి`సైడ్‌ ఏ తెలుగులో అంతంత మాత్రంగానే ఆడింది. మరి ఈ రెండో పార్ట్ అయినా మెప్పిస్తుందా చూడాలి. చరణ్‌ రాజ్‌ సంగీతం అందించారు. ఆయన సంగీతం సినిమాకి బ్యాక్‌ బోన్‌లా నిలుస్తుంది. ఇక ఈ మూవీలో రక్షిత్‌ శెట్టికి జోడీగా రుక్మిణీ వసంత్‌ నటించింది. హేమంత్‌ ఎం రావు దర్శకత్వం వహించారు. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. ఒరిజినల్‌ నిర్మాత రక్షిత్‌ శెట్టి. ఈ నెల 17న ఈ సినిమాని నాలుగు భాషల్లో రిలీజ్‌ చేయబోతున్నారు.  
 

click me!