`పొలిమేర 2`, `కీడాకోలా` ఫస్ట్ డే జెన్యూన్‌ కలెక్షన్లు.. ఏ సినిమా ఎంత చేసిందంటే?

By Aithagoni Raju  |  First Published Nov 4, 2023, 5:50 PM IST

ఈ శుక్రవారం విడుదలైన చిత్రాల్లో `పొలిమేర2`, `కీడాకోలా` సినిమాలు ఉన్నంతలో మంచి ఆదరణ పొందుతున్నాయి. మరి ఫస్ట్ డే రోజు ఈ మూవీస్‌ ఎంత కలెక్ట్ చేశాయి, ఏది ముందుందో తెలుసా?


ఈ శుక్రవారం ఐదారు సినిమాలు విడుదలయ్యాయి. పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న చిత్రాలు పండగ చేసుకున్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. కంటెంట్‌ ఉన్న చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. మరికొన్ని సినిమాలు మంచి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాయి. ఇక శుక్రవారం విడుదలైన చిత్రాల్లో తరుణ్‌ భాస్కర్‌ రూపొందించిన `కీడా కోలా`, అలాగే `పొలిమేర`కి సీక్వెల్‌(పార్ట్ 2)గా వచ్చిన `పొలిమేర 2` ప్రధానంగా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలకే ఎక్కువగా ఆదరణ దక్కుతుంది. 

ఇందులో `పొలిమేర 2` కలెక్షన్లు బాగున్నాయి. సినిమా బిజినెస్‌కి, రిలీజ్‌ని బట్టి చూస్తే ఈ మూవీ మంచి ఆదరణ పొందుతుందని చెప్పొచ్చు. నిజానికి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. కానీ కలెక్షన్లు మాత్రం బాగున్నాయి. `పొలిమేర` వల్ల అంచనాలు ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావాన్ని చూపించింది. అందుకే టాక్‌కి మించిన వసూళ్లని రాబడుతుంది. ఆడియెన్స్ ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Latest Videos

ఇక సత్యం రాజేష్‌, మీనాక్షి, గెటప్‌ శ్రీను, రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్లు (3.05కోట్లు) వసూలు చేయడం విశేషం. ఇందులో 1.83కోట్ల షేర్‌ వచ్చింది. తెలుగు స్టేట్స్ లో 2.42కోట్ల గ్రాస్‌ చేయగా, 1.51కోట్ల షేర్‌ దక్కింది.  తెలంగాణలో ఈ మూవీ 78లక్షలు రాబట్టింది. ఆంధ్రాలో 58లక్షలు, రాయలసీమలో 15లక్షలు వచ్చాయి. మరోవైపు ఇతర భాషలు, ఓవర్సీస్‌లో మరో 32లక్షల షేర్‌ వచ్చింది. ఈ మూవీ నాలుగు కోట్ల బిజినెస్ కాగా, దాదాపు సగం ఒకే రోజు వచ్చింది. శనివారం, ఆదివారంతో ఇది బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాల్లోకి వెళ్తుందని చెప్పొచ్చు. 

పెద్ద స్టార్‌ కాస్ట్ తో వచ్చిన `కీడాకోలా` టాక్‌కి తగ్గ కలెక్షన్లు కనిపించడం లేదు. ఈ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.65కోట్ల(గ్రాస్‌) సాధించింది. ఇందులో 2.85కోట్ల షేర్‌ దక్కింది. తెలంగాణలో ఈ మూవీ 90లక్షలు, ఆంధ్రా, రాయలసీమలో 50లక్షలు మాత్రమే చేసింది. తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ 2.65కోట్ల గ్రాస్‌, 1.40కోట్ల షేర్‌ దక్కింది. కానీ ఇతర లాంగ్వేజ్‌లో, ఓవర్సీస్‌లో దుమ్మురేపింది. అక్కడ రూ.1.45కోట్ల షేర్‌ రావడం విశేషం. ఈ మూవీ బిజినెస్‌ 9 కోట్లు కాగా, తొలి రోజు వచ్చింది రూ.2.85 లక్షలు. బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఇంకా నాలుగు రోజులు ఆడాలి. మరి ఏ మేరకు రీచ్‌ అవుతుందో చూడాలి. 

ఇక ఈ మూవీకి తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించడంతోపాటు ఆయనే ప్రధాన పాత్రలో నటించారు. ఆయనతోపాటు జీవన్, బ్రహ్మానందం, రాగ్‌ మయూర్‌, చైతన్యరావు, విష్ణు, రవీంద్ర విజయ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఫుల్‌ ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈచిత్రం తెరకెక్కింది. అయితే ఫస్టాఫ్‌లో స్టఫ్‌ లేకపోవడంతో ఆడియెన్స్ డిజప్పాయింట్‌ అవుతున్నారు. అదే పెద్ద మైనస్‌. సెకండాఫ్‌ మాత్రం ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. ఫస్టాఫ్‌ని బాగా తీసి ఉంటే సినిమా వేరే రేంజ్‌ హిట్‌ అయ్యేది. టాక్‌కి, కలెక్షన్లకి మధ్య డిఫరెన్స్ రావడానికి అదే కారణం. పైగా తెలంగాణ స్లాంగ్‌లో ఉండటంతో ఏపీ ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. 
 

click me!