ఆలస్యం ఎందుకని రిలీజ్ చేస్తున్నారా? ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ ప్రోమోకు టైమ్ ఫిక్స్..

Google News Follow Us

సారాంశం

ఎట్టకేళలకు ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ అధికారిక ప్రకటన అందించారు. సాంగ్ రెడీగా ఉందంటూ ప్రోమో రిలీజ్ కు టైమ్ కూడా ఫిక్స్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు. రేపే ప్రోమో రాబోతోంది. 
 

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలోని ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)  కోసం ఫ్యాన్స్, సాధారణ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత ఈ కాంబో సెట్ అవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ఏట్టకేళకు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఫస్ట్ సింగిల్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. 

ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలో సమయం ఉండటంతో యూనిట్ మ్యూజికల్ అప్డేట్స్ కురెడీ అయ్యింది. Guntur Kaaram First Single గా ‘దమ్ మసాలా’ Dum Masala  రాబోతోంది. ఈ మాస్ సాంగ్ ప్రోమోను రేపు ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు కొద్దిసేపటి కింద మేకర్స్  అధికారికంగా ప్రకటించారు. మహేశ్ బాబు మాస్ పోస్టర్ నూ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

అయితే, ఇప్పటికే ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ లీకైంది. ఇంకా ఆలస్యం చేస్తే సాంగ్ పై ఉన్న అంచనాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మరోవైపు మాస్ లిరిక్స్ కు మరింత హైప్ పెరిగింది. ఫ్యాన్స్ నుంచి ఒత్తిడికూడా పెరుగుతుండటంతో.. ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారని అంటున్నారు. నవంబర్7న మొదటి పాట పూర్తిగా రాబోతుందని తెలుస్తోంది. రేపు ప్రోమో రానుంది. ఇప్పటికే థమన్ ‘అఖండ’, ‘స్కంద’తో దుమ్ములేపారు. ఇక మహేశ్ బాబుకు ఎలాంటి మాస్ ట్యూన్స్  అందించారో చూడాలి. 

ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే లోపు మొత్తం నాలుగు సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నట్టు నూర్య దేవర నాగవంశీ తెలిపిన విషయం తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత  త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో ‘గుంటూరు కారం’ రాబోతుండటం మంచి అంచనాలను క్రియేట్ చేసింది. హారికా అండ్ హాసిని బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  హీరోయిన్లు. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, జయరామ్, రమ్యకృష్ణ, సునీల్, బ్రహ్మనందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2024 జనవరి 12న సంక్రాంతి కానుగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.