సమంత (Samantha)ఫెస్టివ్ మూడ్ లో ఉన్నారు. ఆమెకు క్రిస్మస్ పండుగ చాలా ప్రత్యేకం కాగా... సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు. క్రిస్మస్ (Christmas 2021)వేడుక కోసం సమంత చాలా రోజుల ముందు నుంచే ఏర్పాట్లలో ఉన్నారట.
సమంత జీవితంలో ఈ ఏడాది మోదం-ఖేదం రెండూ చోటు చేసుకున్నాయి. నటిగా మరపురాని విజయాలు అందుకున్న సమంత వ్యక్తిగత జీవితంలో అతిపెద్ద సమస్యలు ఎదుర్కొన్నారు. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సమంత భారీ విజయం సొంతం చేసుకున్నారు. తమిళ్ రెబల్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె అద్భుతం చేశారు. ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో సమంత చాలా కీలకం అయ్యారు. అలాగే ఇదే ఏడాది ఆమె పాన్ ఇండియా చిత్రాలు ప్రకటించారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
శాకుంతలం మూవీలో అల్లు అర్జున్ తనయ అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. అలాగే యశోద టైటిల్ తో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. యశోద ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. అలాగే మరికొన్ని కొత్త సినిమాలు, సిరీస్ల ప్రకటన చేయాల్సి ఉంది. కెరీర్ పరంగా సమంత దూసుకెళుతుంది.
సమంత వ్యక్తిగత జీవితం మాత్రం పూర్తి నిరాశకు గురిచేసింది. సమంత భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకొని విడిపోయారు. వ్యక్తిగత కారణాలతో మనస్పర్థలు తలెత్తాయి. దీనితో అక్టోబర్ 2న విడాకుల ప్రకటన చేశారు. చైతూ దూరమైన బాధ కంటే కూడా ఆమెపై ప్రచారమైన రూమర్స్ బాధించాయి. నిరాధారమైన కథనాలతో సమంతను కార్నర్ చేయగా, ఆమె తీవ్ర వేదనకు గురయ్యారు. మిత్రుల సహాయంతో సమంత డివోర్స్ డిప్రెషన్ నుండి బయటపడ్డారు.
Also read Samanth : యశోద మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న సమంత... తగ్గేదే లేదంటుంది.
అనేక ఒడిదుడుకులు మానసిక ఒత్తిడి అనంతరం వచ్చిన ఫస్ట్ క్రిస్మస్ ఇది. దీంతో సమంత కుటుంబ సభ్యులు సన్నిహితులతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. క్రిస్మస్ ట్రీ పక్కన ట్రెండీ వేర్ లో నిల్చొని ఫోజులిస్తున్న సమంత లేటెస్ట్ ఫోటో వైరల్ గా మారింది. ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా, ఫ్యాన్స్ , సెలెబ్రిటీలు కామెంట్స్ చేస్తున్నారు. సమంత ముఖంలో చాలా కాలం తర్వాత రియల్ స్మైల్ కనిపించింది. సమంత విడాకుల బాధ నుండి పూర్తిగా బయటపడినట్లు ఆమె ఫోటో చూస్తే అర్థమవుతుంది. హాలీవుడ్ పాప్యులర్ సిరీస్ సిటాడెల్ లో సమంత నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.