Ntr-Ram Charan: నందమూరి ఫ్యామిలీతో మెగా హీరోల వైరం.. ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్

By Sambi ReddyFirst Published Dec 26, 2021, 10:19 AM IST
Highlights


ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు రాజమౌళి. తన ఇద్దరు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో అన్ని భాషలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఇక ప్రమోషన్స్ లో పాల్గొంటున్న టీం... అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. 

ఆర్ ఆర్ ఆర్ (RRR movie)ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మల్టీస్టారర్స్ గురించి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న పోరు గురించి ఓపెన్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా వైరం నడుస్తుందని అన్నారు. అయితే రామ్ చరణ్ నేను మంచి స్నేహితులం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఇక దేశంలో అనేక మంది గొప్ప స్టార్స్ ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత మరిన్ని భారీ మల్టీస్టారర్స్ రావాలని ఆశిస్తున్నాను... అన్నారు. 

ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి స్టార్డం చిరంజీవి (Chiranjeevi)సొంతం చేసుకున్నారు. కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్ సినిమాల్లో నెగిటివ్ రోల్స్ తో పాటు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చిరంజీవి చేశారు. ఎన్టీఆర్ వెండితెర శకం ముగిశాక బాలయ్య ఫార్మ్ లోకి వచ్చారు. నందమూరి అభిమానుల అండతో ఆయన స్టార్ హోదా దక్కించుకున్నారు. అప్పటి నుండి చిరంజీవి-బాలయ్య (Balakrishna) ఫ్యాన్స్ మధ్య పోరు నడుస్తుంది. ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ ఎన్టీఆర్ ఆ కామెంట్స్ చేశారు. 

ఎన్టీఆర్-చిరంజీవి తర్వాత ఈ రెండు ఫ్యామిలీ హీరోలు కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. దశాబ్దాల తర్వాత నందమూరి, మెగా హీరోలు కలిసి నటిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్రత్యేకతల్లో ఇది కూడా ఒకటి. బాలయ్య, చిరంజీవి మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు. అయితే ఫ్యాన్ వార్స్ నడుస్తూ ఉండేవి. అయితే గత మూడేళ్ళుగా బాలయ్య అంటే మెగా హీరోలు దూరం మైంటైన్ చేస్తున్నారు. నాగబాబు అయితే బాలయ్యపై ఓపెన్ గా విమర్శలు చేస్తూ ఉంటారు. 

Also readRajamouli about RRR: `ఆర్‌ఆర్‌ఆర్‌` పునాది రహస్యం చెప్పిన జక్కన్న.. కలెక్షన్ల నెంబర్‌ ఆలోచిస్తారట

ఎన్టీఆర్ మాత్రం చిరు ఫ్యామిలీకి క్రమంగా దగ్గరవుతూ వచ్చాడు. దీని వెనుక కారణం ఆయన నందమూరి కుటుంబం దూరం పెట్టడమే. 2009 ఎన్నికల తర్వాత నారా-నందమూరి కుటుంబాలను ఎన్టీఆర్, హరికృష్ణ కుటుంబాన్ని ఏకాకిని చేశాయి. ఈ క్రమంలో పరిశ్రమలోని ఇతర హీరోలతో ఆయన సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు. రామ్ చరణ్ (Ram charan), మహేష్ ప్రసుత్తం ఎన్టీఆర్ కి బెస్ట్ ఫ్రెండ్స్. మహేష్ తో కూడా ఎన్టీఆర్ త్వరలో మల్టీస్టారర్ చేసినా ఆశ్చర్యం లేదు. 

Also read 2021 మిస్ అయినా... నెక్ట్స్ ఇయర్ అంతకు మించి ట్రీట్ ఇస్తామంటున్న స్టార్ హీరోలు

కాగా జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి పత్రాలు చేస్తున్నారు. డివివి దానయ్య దాదాపు రూ. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. కీరవాణి ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అలియా భట్, అజయ్ దేవ్ గణ్ కీలలు రోల్స్ చేస్తున్నారు. దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ మరోసారి వాయిదా పడనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

click me!