
రాజేంద్ర ప్రసాద్ నటించిన రిడెంప్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ "సేనాపతి". డిసెంబర్ 31న న్యూ ఇయర్ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ "ఆహా"లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేని ఈ మూవీని డైరెక్ట్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై "మెగాస్టార్ చిరంజీవి" కుమార్తె సుష్మిత కొణిదెల మరియు విష్ణు ప్రసాద్ ఈ సిరీస్‌ను నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్ తో పాటు నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వర్ కందేర్గుల, హర్షవర్దన్, రాకేందు మౌళి తదితరులు ఈ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్స్ ప్లే చేశారు.
ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ.. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీట్ లో నిర్మాత, దర్శకుడితో పాటు స్టార్ ప్రోడ్యూసర్ అలు అరవింద్ కూడా హాజరయ్యారు. నిర్మాత.. మెగా డాటర్ సుస్మిత మాట్లాడుతూ.... రాజేంద్ర ప్రసాద్ గారితో ఈ సినిమా చెయ్యడం స్పెషల్ ఆయన నుంచి చాలా చాలా నేర్చుకున్నాం.. అయన అంకిత భావం హాట్సాఫ్ అన్నారు. డైరెక్టర్ పవన్ సాధినేని వర్క్ డెడికేటెడ్ పర్సన్. అందుకే ఈమూవీ అద్భుతంగా వచ్చిందన్నారు. అహలో ఈ సినిమా చెయ్యడం మాకు ఎంతో ఆనందంగ ఉందన్నారు సుస్మిత.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ 45 సంవత్సరాలు గా బ్యానర్ నడుపుతున్నా.. నాకు తరం మారుతున్న ఇంకొక బ్యానర్ రన్ అవుతుంది అదే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్. నేను వర్క్ చెయ్యడం ఆపితే మూలన పదిపోతాను అనుకుంటాను.అందుకే ప్రతి రోజూ ఒక ఛాలెంజ్ గా వర్క చేస్తూ వుంటానన్నారు. రాజేంద్ర ప్రసాద్ తో మాకు మంచి అనుబంధం వుంది. ఆయన ఈ సినమా చేయడం చాలా సంతోషం అన్నారు. డైరెక్టర్ పవన్ సాధినేని టాలెంటెడ్ పర్సన్.. పవన్ సాధినేని గీతా ఆర్ట్స్ లో కూడా త్వరలో సినిమా చేయబోతున్నాడన్నారు. రెండు మూడు సబ్జెక్ట్స్ డిస్కస్ జరుగుతున్నాయి.. పవన్ సాధినేని డైరెక్షన్ బాగుంది. ప్రతి ఒక్కరూ ప్రొడక్ట్ బాగా రావడానికి ఎంతో కృషి చేశారన్నారు అల్లు అరవింద్. అంతే కాదు త్వరలో సుస్మిత వాళ్ల నాన్న చిరంజీవితో సినిమా చేయబోతుంది అంటూ.. కొత్త విషయం చెప్పారు అరవింద్. ఎంత బడ్జెట్ లో చేస్తుందో చూద్దాం అన్నారాయన.
AlsoRead :krithi shetty : ఆ సీన్.. బాగా ఇబ్బంది పెట్టింది.. వణికిపోయానన్న కృతి శెట్టి.
ఇక ఈ మూవీ హీరో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్య గారికి అరవింద్ గారి కంటే నేనే ఎక్కువ ఇష్టం. 45 సంవత్సరాల నా సినిమా లైఫ్ లో ఓకే ఒక్క మిత్రుడు అని చెప్పాలి అంటే అది ఒక్క మెగా స్టార్ చిరంజీవి మాత్రమే అన్నారు. చిన్న బడ్జెట్ పెద్ద సినిమా అంటే గుర్తొచ్చేది రాజేంద్ర ప్రసాద్ సినిమానే అన్నారు. ఇందులో కొత్త క్యారెక్టర్ ట్రై చేశాను. ఈ సినిమా చూస్తే రాజేంద్ర ప్రసాద్ ఇలా వుంటాడా అని అందరూ అనుకుంటారన్నారు నట కిరీటి. ఈనెల 31న ఆహా ఓటీటీలో సేనాపతి స్ట్రీమింగ్ అవ్వబోతోంది.