Yashoda First Glimpse: ఉత్కంఠ రేపుతున్న సమంత 'యశోద' ఫస్ట్ గ్లింప్స్.. అంతా భ్రమేనా..

Published : May 05, 2022, 11:44 AM IST
Yashoda First Glimpse: ఉత్కంఠ రేపుతున్న సమంత 'యశోద' ఫస్ట్ గ్లింప్స్.. అంతా భ్రమేనా..

సారాంశం

సమంత మరో చిత్రంతో అలరించేందుకు రెడీ అవుతోంది. అది అలాంటి ఇలాంటి చిత్రం కాదు.. సమంత నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'యశోద'. 

సమంత ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు. 

ఇక త్వరలో సమంత మరో చిత్రంతో అలరించేందుకు రెడీ అవుతోంది. అది అలాంటి ఇలాంటి చిత్రం కాదు.. సమంత నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'యశోద'. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే ఇది సస్పెన్స్ థ్రిల్లర్ గా అనిపిస్తోంది. 

సమంత ఓ ఆసుపత్రిలో బెడ్ పై ఉంటుంది. సడన్ గా పైకి లేచి తన శరీరాన్ని ఆశ్చర్యంగా చూసుకుంటుంది. ఆమె చేతికి ఏదో బ్యాండ్ ఉంటుంది. ఆ ప్రదేశం ఆమెకు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. బయట ఏదో ఉన్నట్లు చేయి పెడుతుంది. కానీ వెంటనే సమంత ఎక్కడో భ్రమలో.. ఇమాజినరీ వరల్డ్ లో ఉన్నట్లు చూపిస్తారు. 

మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందనే చెప్పాలి. గ్లింప్స్ లో ఎలాంటి డైలాగ్స్ పెట్టలేదు. థ్రిల్లర్ మూవీ అనే కాన్సెప్ట్ మాత్రమే పరిచయం చేశారు తప్ప కథ గురించి ఎలాంటి క్లూ లేదు. తప్పకుండా సినిమాపై ఉత్కంఠ పెంచేలా గ్లింప్స్ ఉందనే చెప్పాలి. 

హరి అండ్ హరీష్ ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, సంపత్ రాజ్, మురళి శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం