Mohanbabu Legal Notice: ట్రోలర్స్, యూట్యూబ్‌ ఛానెల్స్ కి మోహన్‌బాబు లీగల్‌ నోటీసులు.. పదికోట్ల దావా?

Published : Feb 19, 2022, 05:49 PM IST
Mohanbabu Legal Notice: ట్రోలర్స్, యూట్యూబ్‌ ఛానెల్స్ కి మోహన్‌బాబు లీగల్‌ నోటీసులు.. పదికోట్ల దావా?

సారాంశం

సోషల్‌ మీడియాలో మోహన్‌బాబు వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని, మోహన్‌బాబుని టార్గెట్‌ చేస్తూ నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారని తాజాగా యూట్యూబ్‌ ఛాన్సెల్స్ కి, సోషల్‌ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నిర్వహకులకు తెలిపారు మోహన్‌బాబు టీమ్‌. 

మోహన్‌బాబు(Mohanbabu) ట్రోలర్స్ కి షాక్‌ ఇచ్చారు. తనపై గత కొన్ని రోజులుగా నెగటివ్‌ ప్రచారం చేస్తున్న సోషల్‌ మీడియా మాధ్యమాలకు, యూట్యూబ్‌ ఛానెల్స్ కి ఆయన లీగల్‌ నోటీసులు పంపించారు. మోహన్‌బాబు నటించిన `సన్‌ ఆఫ్‌ ఇండియా`(Son of India Movie) చిత్రం శుక్రవారం విడుదలైంది. అంతకుముందు ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే సోషల్‌ మీడియాలో మోహన్‌బాబు వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని, మోహన్‌బాబుని టార్గెట్‌ చేస్తూ నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారని తాజాగా యూట్యూబ్‌ ఛాన్సెల్స్ కి, సోషల్‌ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నిర్వహకులకు తెలిపారు మోహన్‌బాబు టీమ్‌. 

మంచు విష్ణుకి చెందిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీస్‌ తోపాటు ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ కంపెనీల తరఫున శేష్‌ కేఎంఆర్‌ ఆయా మాధ్యమాలకు లీగల్‌ నోటీసులు పంపించారు. ఏపీ టికెట్ల విషయంలోనూ, అలాగే దీనిపై కొందరు పెద్దలు చర్చల విషయంలోనూ మోహన్‌బాబుని టార్గెట్ చేస్తూ తప్పుడు పోస్ట్ లు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనంతగా గత కొన్ని రోజులుగా తమపై విష ప్రచారం జరుగుతుందని తెలిపారు. మోహన్‌బాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా ట్రోల్స్ , మీమ్స్ పెడుతున్నారని, దీంతో మీమ్స్ పేజీల అడ్మిన్‌లకు, అకౌంట్‌ దారులకు, పోస్టింగ్‌కి కారణమైన మెయిన్‌ సోషల్‌ మీడియా మాధ్యమాలను మోహన్‌బాబు టీమ్‌ నుంచి హెచ్చరికలు పంపించారు. 

తన సినిమా `సన్‌ ఆఫ్‌ ఇండియా`పై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని ఈ లీగల్‌ నోటీస్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఇలాంటి మళ్లీ జరిగితే, తమపై మళ్లీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే రూ.10కోట్ల దావా వేస్తామని కూడా హెచ్చరించడం విశేషం. ఇదిలా ఉంటే మోహన్‌బాబు హీరోగా నటించిన `సన్‌ఆఫ్‌ ఇండియా` చిత్రం శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. డైమండ్‌ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ప్రగ్యా జైశ్వాల్‌, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషించారు. మంచు విష్ణు నిర్మించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?