
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తమ్ముడు, రాబిన్ హుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ముందుగా నితిన్ తమ్ముడు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. చాలా కాలంగా నితిన్ కి సరైన హిట్ లేదు. నితిన్ చివరగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో నటించాడు. నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
తమ్ముడు చిత్రంపై నితిన్ కి చాలా హోప్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతహా సీనియర్ నటి లయ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో లయ నితిన్ కి సోదరిగా నటిస్తోంది. ఆమె పాత్ర చుట్టూ కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
కళ్ళు చెదిరేలా ఈ చిత్రంలో యాక్టిన్ బ్లాక్స్ ఉండబోతున్నాయట. ఇప్పటికే 8కోట్ల ఖర్చుతో మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఒక యాక్షన్ సీన్ చిత్రీకరించారు. అలాగే రామోజీ ఫిలిం సిటీలో మరో యాక్షన్ సీన్ తెరకెక్కించారు. ఇప్పుడు మరో ఫైట్ సీన్ చిత్రీకరణ జరుగుతోందట. ఈ చిత్రంలో ఫైట్స్ కోసం కెజిఎఫ్ ఫైట్ మాస్టర్ విక్రమ్ మోర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఆయన ఆధ్వర్యంలోనే యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోందట. ఈ మూడు యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తోంది.