
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, సుకుమార్ దర్శకత్వం సినిమా స్టార్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే కాని ఇప్పడు ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటకు వస్తోంటే మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికుల కళ్లు కూడా ఈ సినిమా వైపే చూస్తోన్నాయి.
తాజాగా రామ్ చరణ్ స్టిల్ ఒకటి బయటకు రావడంతో అంచనాలు మరింత పెరిగాయి ...అయితే ఇప్పడు ఇందులో సమంత లుక్ పై వచ్చిన వార్తలు ఆ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ సినిమాలో సమంత మాటలు రాని ఓ మూగ అమ్మాయి పాత్ర పోషిస్తోందట. అందులోనూ డీగ్లామరైజ్డ్ రోల్ అట..
ఇక ఈ వార్త విన్నప్పటి నుండి ఫిల్మ్‌నగర్ మొత్తం దీని గురించే చర్చ ...సుకుమార్ ఇంత డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు మరి అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అన్న అనుమానాలు ఒకవైపు ఉన్నా మరో వైపు కొత్త దనానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సపోర్ట్ చేస్తునే ఉంటారు కాబట్టి ఈ డిఫరెంట్ జోనర్ ఖచ్చితంగా బిగ్ హిట్ అవుతుందనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు . చూడాలి మరి డిగ్లామరైజ్డ్ పాత్రలో సమంతా ఏ రేంజ్‌లో మెప్పిస్తోందో.