"మహానటి" సావిత్రి జీవితం ఆధారంగా మూవీ.. ఫస్ట్ పోస్టర్

First Published Mar 8, 2017, 2:17 PM IST
Highlights
  • సావిత్రి జీవితం ఆధారంగా "ఎవడే సుబ్రహ్మణ్యం" దర్శకుడు నాగ అశ్విన్ సినిమా
  • "మహానటి" సావిత్రి జీవితం ఆధారంగా తీస్తున్న మూవీ ఫస్ట్ పోస్టర్ విడుదల
  • మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన యూనిట్

తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కథానాయికగా వెలుగొందిన సావిత్రి జీవితం ఆధారంగా "ఎవడే సుబ్రహ్మణ్యం"తో దర్శకుడిగా పరిచయమై, తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నాగఅశ్విన్ తెరకెక్కించనున్న చిత్రం "మహానటి". ఈ చిత్రం స్పెషల్ పోస్టర్ ను నేడు మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు.

 

31 ఏళ్ల పాటు 263 చిత్రాల్లో నటించడమే కాక ప్రేక్షకలోకాన్ని తన నటనతో ఆకట్టుకున్న సావిత్రి తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ, మళయాళ భాషల్లోనూ నటించడం విశేషం.

 

స్వప్న సినిమా సమర్పణలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ ప్లే చేయనుండగా.. సమంత ముఖ్యపాత్ర పోషించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయే చిత్రంగా "మహానటి" నిలవడం ఖాయం.

 

పురుషాధిక్యత ఎక్కువగా ఉండే రోజుల్లో కథానాయికగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సావిత్రి 1950 నుండి 1980 వరకు తన హవా కొనసాగించిన తీరు ఆదర్శనీయం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న "మహానటి" ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగించనుంది.

click me!