అనుష్క బరువు పెరగటానికి అసలు కారణం అదట

Published : Mar 08, 2017, 01:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
అనుష్క బరువు పెరగటానికి అసలు కారణం అదట

సారాంశం

ఇటీవల భారీగా బరువు పెరిగిన అనుష్క అనుష్క అసలు బరువు పెరిగింది సైజ్ జీరోకే కానీ తగ్గలేక పోవటానికి కారణం మాత్రం సింగం3 అట

విమెన్ సెంట్రిక్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులనే కాక విమర్శకులనూ మెప్పించిన నటి అనుష్క. అరుంధతి లాంటి చిత్రంలో మహారాణి అంటే ఇలా ఉండాలి అనేలా నటించి తనకు తిరుగులేదని నిరూపించింది అనుష్క. అరుంధతి తర్వాత అదే తరహా చిత్రాలెన్నో చేసింది అనుష్క. రాణి రుద్రమదేవి పాత్రలో రుద్రమదేవి సినిమా లీడ్ రోల్ చేసిన అనుష్క నటించిన మరో హీరోయిన్ ఓరియంటెడ్‌ చిత్రం సైజ్‌ జీరో. ఈ  సినిమా కోసం అనుష్క తన బరువును 80 కిలోలకు పైగా పెంచుకుంది. అంత కష్టపడి నటించినా ఫలితం దక్కలేదు.

 

అంతే కాకుండా సైజ్ జీరో చిత్రం నిరాశని మిగల్చడమే కాక బాహుబలి చిత్రంపై కూడా అనుష్క బరువు ఎఫెక్ట్‌ పడింది. అయినా ఈ యోగా సుందరి బరువు తగ్గడానికి శాయశక్తులా ప్రయత్నించి కాస్త తగ్గిందట. అయితే పూర్తిగా తగ్గలేకపోయారు. దీనికి కారణం సైజ్ జీరో అనే ప్రచారమే జోరుగా సాగింది. అయితే బాహుబలి–2లో అనుష్కను అందంగా చూపడానికి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి అధికంగా వీఎఫ్‌ఎక్స్‌ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవలసి వచ్చిందని స్వయంగా ప్రకటించాడు. అయితే అనుష్క బరువు తగ్గలేకపోవడానికి అసలు కారణం సైజ్ జీరో చిత్రం కానేకాదట.

 

తన బరువు పెరుగుదల గురించి అనుష్క స్పందించింది. తనకు బరువు పెరగడం, తగ్గడం పెద్ద సమస్య కాదని గతంలోనూ చాలా సార్లు బరువు పెరగటం తగ్గటం చేశానని చెప్పింది. అలానే బాహుబలి చిత్రం కోసం కూడా చాలా వరకు బరువు తగ్గానంది. అయితే అనుకున్న స్థాయిలో బరువు తగ్గకపోవడానికి అసలు కారణం సింగం–3 చిత్ర షూటింగ్‌ సమయంలో అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కారణమని, దాని వల్ల కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని అనుష్క పేర్కొంది. దానివల్ల బరువు తగ్గడానికి యోగా, కసరత్తులు చేయలేకపోయానంది అనుష్క.

 

అయితే ఇప్పుడు మళ్లీ శారీరక వ్యాయామం తదితర కసరత్తులు చేస్తున్నానని, త్వరలోనే తనను స్లిమ్‌గా చూస్తారని అనుష్క చెప్తోంది. మరి జక్కన్న చెక్కిన బాహుబలిలో వీఎఫ్ ఎక్స్ చెక్కుడుతో ఎలా కనిపిస్తుందో కానీ.. తరువాత నటించే సినిమా మాత్రం నాజూగ్గా అందాలు ఆరబోస్తుందన్నమాట.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?