పట్టలేని సంతోషంలో సమంత... ఆయన్ని గట్టిగా హగ్ చేసుకొని

Published : Nov 12, 2022, 05:34 PM IST
పట్టలేని సంతోషంలో సమంత... ఆయన్ని గట్టిగా హగ్ చేసుకొని

సారాంశం

సమంత ఎక్స్ట్రావర్ట్. బాధైనా సంతోషమైనా దాచుకోకుండా చూపించేస్తుంది. తాజాగా ఆమె తన జిమ్ ట్రైనర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు యశోద సక్సెస్ క్రెడిట్ ఇచ్చారు. 

ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్ సమంతకు చాలా కాలంగా ట్రైనర్ గా ఉన్నారు. యశోద చిత్రానికి కావలసిన  వెయిట్, ఫిట్నెస్ సమంత సాధించడంలో జునైద్ సహకరించాడు. యశోద సక్సెస్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో జునైద్ కి తనదైన స్టైల్ లో సమంత కృతఙ్ఞతలు తెలిపారు. ఆయన్ని గట్టిగా హగ్ చేసుకున్న త్రో బ్యాక్ ఫోటో షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్ పోస్ట్ చేశాడు. 

యశోద సక్సెస్ తో నేను నా ఫెవరేట్ స్వీట్ జిలేబి తింటున్నాను. దీనంతటికి కారణం నీవే. గత కొన్ని నెలలుగా నాతో ఉన్న కొద్ది మందిలో నువ్వూ ఒకడివి. నా లోటు పాట్లు, కష్టనష్టాలు అన్నీ దగ్గరుండి చూశావు. లక్ష్యం మధ్యలో వదిలేయకుండా వెన్నంటి ఉన్నావు. మద్దతుగా నిలిచావు. నీకు కృతజ్ఞతలు... అంటూ సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు. 

సమంత తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో అనారోగ్యంతో కూడా వ్యాయామం చేస్తున్న వీడియో పోస్ట్ చేశారు. ఒక చేతికి సిరంజీ ఉండగా మరో చేత్తో సమంత బరువులు ఎత్తున్నారు.  కాగా యశోద హిట్ టాక్ సొంతం చేసుకుంది.  వరల్డ్ వైడ్ యశోద ఫస్ట్ డే ఆరు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. యూఎస్ లో యశోద చిత్రానికి రెస్పాన్స్ బాగుంది. పాజిటివ్ టాక్ నేపథ్యంలో వీకెండ్ వసూళ్లు మరింత పంజుకునే సూచనలు కలవు . 

దర్శక ద్వయం హరి-హరీష్ యశోద చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ కీలక రోల్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా యశోద నవంబర్ 11న ఐదు భాషల్లో విడుదలైంది. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు