ఆసక్తిరేపుతున్న శర్వానంద్ కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్!

Siva Kodati |  
Published : May 24, 2019, 09:43 PM IST
ఆసక్తిరేపుతున్న శర్వానంద్ కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్!

సారాంశం

శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తాడట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చురుకుగా వ్యవహరించే అసాధారణ వ్యక్తిగా శర్వానంద్ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తాడట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చురుకుగా వ్యవహరించే అసాధారణ వ్యక్తిగా శర్వానంద్ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని ఉత్కంఠభరిత అంశాలతో తెరకెక్కించాడట. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల సమయాన్ని ప్రకటిస్తూ ఆసక్తికరమైన ప్రీ లుక్ ని రిలీజ్ చేశారు. 

మే 25 శనివారం సాయంత్రం 4:05 గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. సుధీర్ వర్మ తన తొలి చిత్రం స్వామిరారాతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అతడు తెరకెక్కించిన చిత్రాలు విజయం సాధించలేదు. 

ఇక శర్వానంద్ నటించిన చివరి చిత్రం పడిపడి లేచే మనసు నిరాశపరిచింది. ఈ చిత్రంతో పుంజుకోవాలని శర్వానంద్ భావిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా