'జబర్దస్త్' లో రోజా నవ్వులు ఇక ఉండవ్.. లేటెస్ట్ టాక్!

Siva Kodati |  
Published : May 24, 2019, 09:00 PM ISTUpdated : May 24, 2019, 09:02 PM IST
'జబర్దస్త్' లో రోజా నవ్వులు ఇక ఉండవ్.. లేటెస్ట్ టాక్!

సారాంశం

నవ్వులు పూయించే కామెడీ షో జబర్దస్త్ కు విపరీతమైన క్రేజ్ నెలకొంది. విభిన్నమైన స్కిట్ లతో యువ కమెడియన్స్ బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్నారు. జబర్దస్త్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది న్యాయ నిర్ణేతలుగా నాగబాబు, రోజా.

నవ్వులు పూయించే కామెడీ షో జబర్దస్త్ కు విపరీతమైన క్రేజ్ నెలకొంది. విభిన్నమైన స్కిట్ లతో యువ కమెడియన్స్ బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్నారు. జబర్దస్త్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది న్యాయ నిర్ణేతలుగా నాగబాబు, రోజా. జబర్దస్త్ ప్రారంభం నుంచి వీరిద్దరే జడ్జీలుగా ఉన్నారు. జబర్దస్త్ కమెడియన్లతో నాగబాబు, రోజా బాగా కలసిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత కూడా రోజా ఈ షోలో పాల్గొన్నారు. 

రాజకీయాల్ని, జబర్దస్త్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఇకపై రోజా జబర్దస్త్ లో కొనసాగే అవకాశాలు లేవు. రోజా రెండవసారి కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఈ సారి వైసిపి అధికారంలోకి వచ్చింది. దీనితో ఆమెకు పొలిటికల్ గా మరింత భాద్యతలు పెరుగుతాయి. మరో కీలక అంశం ఏంటంటే జగన్ కేబినెట్ లో రోజాకు మంత్రి పదవి ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. 

రోజాకు మంత్రి పదవి దక్కితే తప్పనిసరిగా జబర్దస్త్ ని వదిలేయాల్సి ఉంటుంది.  మహిళా ఎమ్మెల్యేలలో కీలకంగా ఉన్నది రోజానే కాబట్టి ఆమెకు మంత్రి పదవి లాంఛనమే అని అంటున్నారు. దీనితో రోజా జబర్దస్త్ ని వదిలేయక తప్పదు. రోజా నగిరి నియోజకవర్గం నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తనని ఐరెన్ లెగ్ అంటూ హేళన చేసిన వారికి ఈ విజయమే గుణపాఠం అని రోజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?
Mahesh Babu: `వారణాసి` కోసం మహేష్‌ బాబు సాహసం.. కెరీర్‌లోనే మొదటిసారి ఇలా.. తెలిస్తే గూస్‌ బంమ్స్