సమంత, చైతుల వార్.. బాక్సాఫీస్ వద్ద భార్యదే గెలుపు!

By Udayavani DhuliFirst Published Sep 14, 2018, 11:38 AM IST
Highlights

అక్కినేని నాగ చైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు', అతడి భార్య సమంత నటించిన 'యూటర్న్' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విడుదలకు ముందుకు నుండి చైతు సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అక్కినేని నాగ చైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు', అతడి భార్య సమంత నటించిన 'యూటర్న్' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విడుదలకు ముందుకు నుండి చైతు సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సీనియర్ నటీనటులు, ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్ అవుతుందనుకుంటే రొటీన్ ఫార్ములా అంటూ రివ్యూ ఇచ్చేశారు ఆడియన్స్. సమంత 'యూటర్న్' చిత్రానికి హైప్ లేనప్పటికీ సైలెంట్ గా వచ్చి సక్సెస్ కొట్టేసింది. విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంటున్న ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులకు ఈజీ కనెక్ట్ అయిపోతుంది. దీంతో సమంత సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉంటే, చైతు మాత్రం మరో ఫ్లాప్ తో డీలా పడ్డాడు.

ఇలాంటి పోలికలు వస్తాయనే ఈ రెండు సినిమాలను గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ చైతు సినిమా వాయిదా పడుతూ వచ్చి సమంత సినిమాతో పోటీకి దిగింది. కానీ ఊహించని విధంగా చైతు సినిమా ఫ్లాప్ కావడంతో చతికిల పడ్డాడు. మరో అల్లరి అల్లుడు సినిమా అవుతుందనుకుంటే రిజల్ట్ కాస్త రివర్స్ అయింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద తన భర్తకి గట్టి పోటీనే ఇస్తోంది సమంత. 

ఇవి కూడా చదవండి.. 

రేపే విడుదల.. భర్తతో సమంత పోటీ!

రివ్యూ: శైలజా రెడ్డి అల్లుడు

రివ్యూ: యూటర్న్

click me!