ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మృతి!

Published : Sep 14, 2018, 10:45 AM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మృతి!

సారాంశం

ప్రముఖ తెలుగు దర్శకుడు, సినీ విమర్శకుడు కె.ఎన్.టి శాస్త్రి కన్నుమూశారు. దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తిలదానం, సురభి(డాక్యుమెంటరీ) వంటి చిత్రాలకు నంది అవార్డు కూడా అందుకున్నారు

ప్రముఖ తెలుగు దర్శకుడు, సినీ విమర్శకుడు కె.ఎన్.టి శాస్త్రి కన్నుమూశారు. దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తిలదానం, సురభి(డాక్యుమెంటరీ) వంటి చిత్రాలకు నంది అవార్డు కూడా అందుకున్నారు.

తెలుగుతో పాటు ఆయన కన్నడ చిత్రాలకు కూడా పని చేశారు. 2006 లో ఆయన నందితా దాస్ హీరోయిన్ గా తెరకెక్కించిన 'కమ్లి' అనే చిత్రాన్ని దక్షిణ కొరియాలోని బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఆయన దర్శకత్వం వహించిన తిలదానం, కమ్లి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి.

పలు చలన చిత్రోత్సవాలకు జ్యూరీ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. సినీ విమర్శకుడిగా ఆయన పలు పుస్తకాలను కూడా రాశారు. దర్శకుడిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయన ఏడు జాతీయ అవార్డులు, 12 అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్