Samantha: సమంత జోరు ముందు నిలబడలేకపోయిన బోల్డ్ బ్యూటీ

By team telugu  |  First Published Dec 30, 2021, 6:18 PM IST

ప్రస్తుతం సమంత జోరు మామూలుగా లేదు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సామ్ సినిమాల విషయంలో మరింత యాక్టివ్ గా మారింది. తన కెరీర్ లో తొలిసారి పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది.


ప్రస్తుతం సమంత జోరు మామూలుగా లేదు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సామ్ సినిమాల విషయంలో మరింత యాక్టివ్ గా మారింది. తన కెరీర్ లో తొలిసారి పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. వరుసగా పాన్ ఇండియా చిత్రాలకు సైన్ చేస్తోంది. అలాగే హాలీవుడ్ చిత్రాల్లో కూడా ఛాన్స్ దక్కించుకుంటోంది. నటిగా ప్రస్తుతం సమంత అనేక ప్రయోగాలు చేస్తోంది. 

ఇదిలా ఉండగా సమంత నటించిన ఏకైక వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ 2'. ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ రోల్ లో విలక్షణమైన నటన కనబరిచింది. సర్వత్రా ప్రశంసలు దక్కించుకుంది. అయితే సమంత రోల్ పై విమర్శలు కూడా వినిపించాయి. ఆమె పాత్ర తమిళనాట వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం ఒక్క వెబ్ సిరీస్ తోనే సమంత ఈ ఏడాది ఓటిటిలో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. 

Latest Videos

ఓటిటిలో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చిన నటీనటుల జాబితాలో సమంత టాప్ 4 గా నిలిచింది. ఓటిటి క్వీన్ గా పిలవబడే బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టేని సైతం వెనక్కి నెడుతూ సమంత ఈ ఘనత సాధించింది. నెట్ ఫ్లిక్స్ లో రాధికా ఆప్టే ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. రాధికా ఆప్టే సినిమాల కంటే ఓటిటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. 

 

Most popular OTT actors in India (Sep-Nov 2021): stays at no. 1, (no. 6), (no. 8), and (no. 10) make an entry in the Top 10 pic.twitter.com/qO5bnAWHJb

— Ormax Media (@OrmaxMedia)

ఓటిటిలో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగా మనోజ్ బాజ్ పాయ్ మొదటి స్థానంలోనూ, మనోజ్ త్రిపాఠి రెండో స్థానంలో, నవాజుద్దీన్ సిద్ధిఖి మూడో స్థానంలో ఉండగా.. సామ్ నాలుగో స్థానం సాధించింది. బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే 5వ స్థానంతో సరిపెట్టుకుంది.మిల్కీ బ్యూటీ తమన్నా 10 వ స్థానంలో నిలవడం విశేషం. 

Also Read: Covid: బాహుబలి భామకు కరోనా, నమ్రత సోదరికి కూడా.. సెలెబ్రిటీలలో అల్లుకుపోతున్న కోవిడ్..

click me!