Samantha : సమంత డిప్రెషన్ కి చిరంజీవి సలహా.. కట్ చేస్తే సుకుమార్ లక్!

By Sambi Reddy  |  First Published Dec 30, 2021, 5:15 PM IST

ఆ మధ్య చిరంజీవి, రామ్ చరణ్ పాల్గొన్న ఓ ప్రైవేట్ ఈవెంట్ కి సమంత కూడా వెళ్లారట. అక్కడ చిరంజీవి(Chiranjeevi), సమంత, రామ్ చరణ్ మధ్య సంభాషణ జరిగిందట. చైతూతో విడాకుల కారణంగా సమంత డిప్రెషన్ ఫీల్ అవుతున్నారని సన్నిహితుల ద్వారా తెలుసుకున్న చిరంజీవి.. సమంతను ఇదే విషయం అడిగారట.


తెలుగు రాష్ట్రాల్లో ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ ఊపేస్తోంది. స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫార్మ్ లో ఉన్న సమంత (Samantha)ఈ సాంగ్ చేయడం అందరినీ షాక్ కి గురిచేసింది. కెరీర్ లో మొదటిసారి సమంత ఐటెం నంబర్ చేయగా.. దీని వెనుక మెగాస్టార్ చిరంజీవి ప్రమేయం ఉందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

అల్లు అర్జున్ (Allu Arjun)-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగా.. సమంత నటించిన 'ఊ అంటావా ఊ ఊ అంటావా' సాంగ్.. ప్రత్యేకంగా నిలిచింది. ఈ సాంగ్ లో సమంత బోల్డ్ మూమెంట్స్, స్కిన్ షో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. పుష్ప చిత్రానికి ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ హైలెట్ అయ్యింది. అయితే ఈ సాంగ్ లో సమంత నటించడం వెనుక చిరంజీవి హస్తం ఉందట. 

Latest Videos

అదెలా అంటే... ఆ మధ్య చిరంజీవి, రామ్ చరణ్ పాల్గొన్న ఓ ప్రైవేట్ ఈవెంట్ కి సమంత కూడా వెళ్లారట. అక్కడ చిరంజీవి(Chiranjeevi), సమంత, రామ్ చరణ్ మధ్య సంభాషణ జరిగిందట. చైతూతో విడాకుల కారణంగా సమంత డిప్రెషన్ ఫీల్ అవుతున్నారని సన్నిహితుల ద్వారా తెలుసుకున్న చిరంజీవి.. సమంతను ఇదే విషయం అడిగారట. అదే సమయంలో షూటింగ్స్ లో బిజీ కావడం ద్వారా ఈ డిప్రెషన్ ని అధిగమించవచ్చని సలహా ఇచ్చారట. 

ఇక పుష్ప మూవీలో ఐటెం సాంగ్ గురించి చెప్పి ... నచ్చితే ఆ సాంగ్ చేయమని సూచించారట. అలాగే సుకుమార్ కి చిరంజీవి ఫోన్ చేసి ఈ విషయం మాట్లాడారట. సమంత చేస్తానంటే అంతకంటే కావలిసింది ఏముంటుందని సుకుమార్ అన్నారట. సమంత కూడా చిరంజీవి సలహా కాదనకుండా ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నారట. ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ ని ప్రత్యేకమైన సెట్ లో దాదాపు 5 రోజులు షూటింగ్ చేశారు. ఇక ఈ సాంగ్ కి కోటిన్నర వరకు సమంత తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. 

అలా చిరంజీవి ప్రమేయంతో సమంత పుష్ప (Pushpa)మూవీలో ఐటెం సాంగ్ చేశారని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వాదన. సుకుమార్ గత చిత్రం రంగస్థలం మూవీలో సమంత నటించి, పల్లెటూరి అమ్మాయి పాత్రలో అబ్బురపరిచారు. ఇటీవల పుష్ప సక్సెస్ మీట్ లో సైతం రష్మిక ఎదుటే సమంతను పొగడ్తలతో ముంచెత్తాడు సుకుమార్. ఆమె నా ఫేవరేట్ హీరోయిన్.. అంత గొప్ప నటి మరలా నాకు దొరుకుతుందా..అనే సందేహం వెంటాడింది అంటూ సుకుమార్ మనసులో మాట బయటపెట్టారు. సుకుమార్ నమ్మకాన్ని మరోసారి నిజం చేస్తూ బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చింది సమంత. 

Also read Samantha : నిన్ను మాత్రమే నమ్ముతా.. స్టార్ హీరో గురించి సమంత ఎమోషనల్ పోస్ట్.

ఇక న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం సమంత గోవా వెళ్లారు. తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి ఆమె టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు సమంత కొత్త ప్రాజెక్ట్ యశోద షూటింగ్ జరుపుకుంటుంది. ఆమె నటించిన శాకుంతలం విడుదల కావాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. 

Also read Samantha : ఫ్రీ బర్డ్ లైఫ్... సమంత కోరుకున్నది ఇదేనా?

click me!