నేను ఎందుకున్నానో నాకే తెలియదంటున్న సమంత

Published : Oct 12, 2017, 05:59 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
నేను ఎందుకున్నానో నాకే తెలియదంటున్న సమంత

సారాంశం

అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత పెళ్లి తర్వాత తొలిసారి మీడియా ముందుకు సమంత చైతూని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్న సామ్

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని వారింటి కోడలిగా అడుగుపెట్టేసింది. అక్కినేని వారసుడు నాగచైతన్య తో ఆమె వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. వివాహం జరిగిన తర్వాత తొలిసారిగా ఆమె మీడియా ముందుకు వచ్చింది. అది కూడా తన మామ నాగార్జునతో కలిసి.  నాగార్జున, సమంతలు కీలక పాత్రలు పోషించిన రాజుగారి గది 2 సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మామా కోడళ్లు ఇద్దరు  మీడియాతో పంచుకున్న వివరాలు వారి మాటల్లోనే..

‘‘అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. చైతూ నాకు ఎనిమిదేళ్లుగా మంచి స్నేహితుడు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే.. నా పాత్రకి చాలా బాగుందటుంది. అయితే.. ఈ పాత్ర కోసం నన్నే ఎందుకు ఎంచుకున్నారో నాకు తెలియదు. అసలు సినిమాలో నేను ఎందుకు ఉన్నానో కూడా నాకు తెలియదు. కానీ నా పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం.’’ అని సమంత తెలిపారు.

 

‘‘ ఇన్ని రోజులు పెళ్లి పనుల్లో చాలా బిజీబిజీగా గడిపింది సమంత. అందుకే ఇన్ని రోజులు సినిమా ప్రమోషన్స్ కి రాలేకపోయింది.  ఇక సమంత మా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత విడుదలౌతున్న తొలి సినిమా ఈ రాజుగారి గది 2. కాబట్టి కచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టాలి. ఆ టెన్షన్ మా అందరిలోనూ ఉంది. ఈ చిత్రంలో మా ఇద్దరి పాత్రలు చాలా బాగుంటాయి’’ అని నాగార్జున చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన