చైతు సరిగ్గా నటించకపోతే తిట్టేస్తా.. సమంత కామెంట్స్!

Published : Apr 15, 2019, 10:18 AM IST
చైతు సరిగ్గా నటించకపోతే తిట్టేస్తా.. సమంత కామెంట్స్!

సారాంశం

నటి సమంత తన భర్త నాగచైతన్య సరిగ్గా నటించకపోతే తిట్టేస్తానని చెబుతోంది. అందులో తప్పు లేదని అది భార్యగా తన బాధ్యత అని అంటోంది.

నటి సమంత తన భర్త నాగచైతన్య సరిగ్గా నటించకపోతే తిట్టేస్తానని చెబుతోంది. అందులో తప్పు లేదని అది భార్యగా తన బాధ్యత అని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. పెళ్లి తరువాత మనసుకు ప్రశాంతత లభించిందని, పెళ్లికి ముందుకు తను నటించే ప్రతి సన్నివేశాన్ని తనే మానిటరింగ్ చేసుకొని నటించేదాన్ని అని 
చెప్పుకొచ్చింది.

పెళ్లి తరువాత నాగచైతన్య నటించే సన్నివేశాలను మానిటరింగ్ చేస్తున్నట్లు, తగిన సలహాలు ఇస్తున్నట్లు చెప్పింది. అయితే చైతు నువ్వెందుకు కష్టపడతావు డైరెక్టర్ చూసుకుంటారని చెప్పినా.. తాను మాత్రం ఊరుకోనని, భర్త గురించి ఆలోచించడం భార్య బాధ్యత అని చెప్పుకొచ్చింది.

పెళ్లి తరువాత మంచి కథా చిత్రాలలోనే నటించాలని తన భర్తతో ఒప్పందం చేసుకున్నట్లు.. అలా నటించిన చిత్రమే 'మజిలీ' అనే తెలిపింది. ఇకపై కూడా వైవిధ్యభరితమైన చిత్రాల్లోనే నటించాలనేది తన కోరిక అని వెల్లడించింది.

నాగచైతన్య ఒక సన్నివేశంలో బాగా నటిస్తే ప్రశంసిస్తానని, ఆశించిన విధంగా నటించకపోతే తిట్టేస్తానని చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో క్రీడాకారిణిగా, దివ్యాంగురాలిగా నటించాలని  కోరుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'ఓ బేబీ ఎంత సక్కగున్నావే' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
 

PREV
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా