'ఏబీసీడీ' ట్రైలర్.. అల్లు హీరోకి మరో హిట్ వస్తుందా..?

Published : Apr 15, 2019, 09:56 AM IST
'ఏబీసీడీ' ట్రైలర్.. అల్లు హీరోకి మరో హిట్ వస్తుందా..?

సారాంశం

అల్లు శిరీష్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఏబీసీడీ'. అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్‌ దేసీ అనేది ట్యాగ్ లైన్. 

అల్లు శిరీష్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఏబీసీడీ'. అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్‌ దేసీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ సోమవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అమెరికాలో సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి భారత కి వచ్చి మధ్య తరగతి వ్యక్తిగా జీవించలేక ఎలా ఇబ్బంది పడతాడనే కాన్సెప్ట్ ని కామెడీ యాంగిల్ లో డీల్ చేశాడు డైరెక్టర్. ట్రైలర్ లో అల్లు శిరీష్ చెప్పే డైలాగ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. '

'డ్యాడ్‌.. నువ్వు స్వయంకృషిలో చిరంజీవిలా ఫీలవ్వకు. కష్టాల్లోకి తోసేస్తే మారిపోతానని అనుకోకు. నేను రిచ్‌గానే పుట్టాను, రిచ్‌గానే పెరిగాను, రిచ్‌గానే ఉంటాను'' అంటూ హీరో చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో అల్లు శిరీష్ స్నేహితుడిగా మాస్టర్ భరత్ నటించాడు. మే 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?