'మహర్షి' కు లెంగ్త్ సమస్య? పాటలు సైతం..!!

By Udaya DFirst Published Apr 15, 2019, 9:40 AM IST
Highlights

మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం 'మహర్షి' . 

మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం 'మహర్షి' . పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో, 'అల్లరి' నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు.  రిలీజ్ కు దగ్గరపడుతున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్రంలో పాటలు రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం గురించిన కొత్త వార్తలు ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం లెంగ్త్ గురించి, చిత్రంలో పాటలు గురించి మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

మీడియా వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మహర్షి సినిమా దాదాపు మూడు గంటలు లెంగ్త్ ఉండబోతోందిట. ఈ విషయమై దర్శక,నిర్మాతలు తర్జన, భర్జనలు పడుతున్నారట. అంత లెంగ్త్ సినిమా సక్సెస్ కు ఏమన్నా ఇబ్బందిపెడుతుందేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. షార్ప్ గా రెండున్నర గంటలు ఉంటే సరిపోతుందని దిల్ రాజు అభిప్రాయ పడుతున్నారట. అయితే అలా చేస్తే కొన్ని సీక్వెన్స్ లు తొలిగించాల్సి వస్తుందని వంశీ పైడిపల్లి నో చెప్పుతున్నట్లు సమాచారం. 

అలాగే ఈ చిత్రంలో ఎనిమిది పాటలు ఉంటాయని వినిపిస్తోంది.  ఆరు స్ట్రయిట్ సాంగ్స్, రెండు బ్యాక్ గ్రవుండ్ లో వచ్చే సాంగ్స్. అయితే మొత్తం పాటలన్నీ దేవిశ్రీ ప్రసాద్ మనస్సు పెట్టి చేసారని, అదిరిపోతాయంటున్నారు. 

ఫస్టాఫ్ ఫన్ తో దుమ్ము రేపిన ఈ సినిమా సెకండ్ హాఫ్ నుంచి కథ చాలా సీరియస్ గా సాగుతుందట.   వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.   

 

click me!