'#మీటూ'పై సమంత రెస్పాన్స్!

By Udayavani DhuliFirst Published Oct 9, 2018, 11:20 AM IST
Highlights

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా బయటకొచ్చి తమ అనుభవాలను చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ఆర్టిస్టులతో పాటు జర్నలిస్ట్ లు కూడా ఈ విషయంపై స్పందించారు.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా బయటకొచ్చి తమ అనుభవాలను చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ఆర్టిస్టులతో పాటు జర్నలిస్ట్ లు కూడా ఈ విషయంపై స్పందించారు.

హాలీవుడ్ లో మొదలైన ఈ మీటూ మూమెంట్ ఇప్పుడు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ కి కూడా పాడింది. టాలీవుడ్ ప్రముఖ సింగర్ చిన్మయి చిన్నతనంలో తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. అయితే కొందరు ఈ మీటూ మూమెంట్ ని సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఈ మీటూ ఉద్యమంపై స్పందించింది. ''#మీటూ మూమెంట్ లో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడడానికి చాలా మంది మహిళలు ధైర్యంగా ముందుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీ ధైర్యం కొనియాడదగినది.

కొందరు వ్యక్తులు మాత్రమే కాకుండా ఇతర మహిళలు కూడా మిమ్మల్ని అనుమానిస్తూ అవమానిస్తూ ఆధారాల గురించి అడగడం సిగ్గు చేటు. మీరు చెబుతున్న విషయాలతో ఎందరో చిన్నారులకి రక్షణగా నిలుస్తున్నారని తెలుసుకోండి. థాంక్యూ. #మీటూ మూమెంట్ ని నేను సపోర్ట్ చేస్తున్నాను'' అని సమంత వెల్లడించింది. 

ఇది కూడా చదవండి.. 

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు
 

click me!