హృదయ విదారక ఘటన.. మనసులు గెలుచుకున్న శేఖర్ కమ్ముల, ఏం జరిగిందంటే..

By telugu team  |  First Published Oct 26, 2021, 12:02 PM IST

సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు Sekhar Kammula టాలీవుడ్ లో విభిన్నమైన దర్శకుడు. శేఖర్ కమ్ముల చిత్రాలు సింపుల్ ఎమోషన్ తో కట్టిపడేసే విధంగా ఉంటాయి. శేఖర్ కమ్ముల తరచుగా తన సోషల్ మీడియాలో సామజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. 


సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు Sekhar Kammula టాలీవుడ్ లో విభిన్నమైన దర్శకుడు. శేఖర్ కమ్ముల చిత్రాలు సింపుల్ ఎమోషన్ తో కట్టిపడేసే విధంగా ఉంటాయి. శేఖర్ కమ్ముల తరచుగా తన సోషల్ మీడియాలో సామజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. తాజాగా శేఖర్ కమ్ముల అందరి హృదయాలు గెలుచుకునే విధంగా ఓ రైతుకు సాయం అందించారు. ఈ సంఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నేలమర్రి గ్రామంలో జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. కప్పల లక్ష్మయ్య, అతని సోదరులు తమకు ఉన్న పొలాన్ని ఇటీవల అమ్మేశారు. ఇందులో లక్ష్మయ్య వాటా రూ 10 లక్షలు వచ్చింది. ప్రస్తుతం లక్షయ్య పూరి గుడిసెలో ఇబ్బందులు పడుతూ నివాసం ఉంటున్నాడు. పొలం అమ్మిన డబ్బుతో ఇల్లు నిర్మించుకోవాలని భావించాడు. దీనికోసం రూ.6 లక్షల డబ్బుని ఇంట్లో బీరువాలో దాచి పెట్టాడు. 

Latest Videos

మేస్త్రితో మాట్లాడి ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసేందుకు కూడా సిద్ధం అయ్యాడు. ఇటీవల లక్ష్మయ్య వంట చేసుకుందామని గ్యాస్ స్టవ్ వెలిగించాడు. అప్పటికే గ్యాస్ లీకై ఉండడంతో మంటలు అంటుకున్నాయి. లక్ష్మయ్య మంటల్లో నుంచి క్షేమంగానే బయట పడ్డాడు. కానీ గుడిసె పూర్తిగా కాలిపోయింది. బీరువాలో ఉన్న డబ్బు కూడా కాలిపోయింది. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటన లక్ష్మయ్యకు తీవ్ర వేదనని మిగిల్చింది. గ్రామంలో ప్రతి ఒక్కరిని ఈ సంఘటన కలచివేసింది. 

Also Read: ఫ్యామిలీ కోసం డబ్బు సంపాదించింది తమ్ముడే.. ఆర్థిక కష్టాలు చెప్పిన విజయ్ దేవరకొండ

లక్ష్మయ్యకు జరిగిన ఈ సంఘటన గురించి దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ టివి ఛానల్ కథనం ద్వారా తెలుసుకున్నారు. ఈ విషాదం పట్ల శేఖర్ కమ్ముల చలించిపోయారు. లక్ష్మయ్యని ఆదుకోవాలని రంగంలోకి దిగారు. వెంటనే లక్ష్మయ్య బ్యాంకు ఖాతాకు నేరుగా రూ లక్ష బదిలీ చేశారు. భవిష్యత్తులో కూడా లక్ష్మయ్యకు అండగా ఉంటానని శేఖర్ కమ్ముల హామీ ఇచ్చారు. 

ఇదిలా ఉండగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన Love Story చిత్రం గత నెలలో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. Naga Chaitanya, సాయి పల్లవి ఈ మూవీలో జంటగా నటించారు. 

click me!