Bigg boss telugu 5:ఎలిమినేటైన ప్రియ ఏడు వారాలకు ఎంత తీసుకున్నారంటే.. దక్కింది తక్కువే!

By team telugu  |  First Published Oct 26, 2021, 11:52 AM IST

మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే ప్రియ చాలా ఫేమస్. సీరియల్ నటిగా బుల్లితెర ప్రేక్షకులకు Priya బాగా పరిచయం. అలాగే యంగ్ ఏజ్ నుండి అనేక సినిమాలలో రోల్స్ చేశారు. 


స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా టాప్ ఫైవ్ కి వెళుతుందనుకున్న నటి ప్రియ ఏడు వారాలకే తన జర్నీ ముగించారు. బిగ్ బాస్ హౌస్ నుండి ఆమె ఈ ఆదివారం ఎలిమినేట్ కావడం జరిగింది.ఇక Bigg boss telugu 5 యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ సీజన్ కి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ లో హౌస్ లోకి ప్రవేశించారు. ఏడుగురి ఎలిమినేషన్ తరువాత 12మంది కంటెస్టెంట్స్ మిగిలారు. 


మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే ప్రియ చాలా ఫేమస్. సీరియల్ నటిగా బుల్లితెర ప్రేక్షకులకు Priya బాగా పరిచయం. అలాగే యంగ్ ఏజ్ నుండి అనేక సినిమాలలో రోల్స్ చేశారు. ఇక కాలం కలిసిరాలేదు కానీ, హీరోయిన్ రేంజ్ గ్లామర్ ప్రియ సొంతం. బిగ్ బాస్ హౌస్ లో తన క్యూట్ లుక్స్ తో యంగ్ బ్యూటీస్ కి కూడా గట్టిపోటీ ఇచ్చారు. మరి ఇన్ని క్వాలిటీస్, అడ్వాంటేజెస్ ఉన్న ప్రియ ఇంత తక్కువ సమయానికే చాప చుట్టేయడం కొంచెం షాకింగ్ విషయమే. 

Latest Videos

Also read వైయస్ జగన్ డెసిషన్ ఎఫెక్ట్: 'ఆర్.ఆర్.ఆర్' కు ఎంత లాస్ అంటే..
బోల్డ్ యాటిట్యూడ్ కలిగిన గేమ్ ప్లాన్స్ హౌస్ లో ప్రియ ఫాలో అయ్యారు. ఎవరు ఏమన్నా తగ్గకపోవడం, తోటి కంటెస్టెంట్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆమెకు మైనస్ అయ్యింది. లహరి, రవి లేట్ నైట్ బాత్రూమ్ లో కౌగిలించుకుంటూ కనిపించారని కామెంట్ చేసి, ప్రియ సంచలనానికి తెరలేపింది. ఈ కామెంట్ Anchor ravi, లహరి ఆమెపై ఫైర్ అయ్యేలా, పెద్ద గొడవ జరిగేలా ప్రేరేపించింది. ఇక గత వారం కెప్టెన్సీ టాస్క్ లో కంటెస్టెంట్ సన్నీపై ఆమె ఫైర్ అయ్యారు. చెంప పగులుద్ది వంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాలే ప్రియ ఎలిమినేషన్ కి కారణం అని కొందరు భావిస్తున్నారు.

Also read బిగ్ బాస్ 5 నుంచి ప్రియా అవుట్.. ఇద్దరూ ఎలిమినేట్ అనుకున్నారు, కానీ..

 ఇక ఏడు వారాలు హౌస్ లో ఉన్న ప్రియ రెమ్యూనరేషన్ గా ఎంత తీసుకున్నారు అనే చర్చ నడుస్తుండగా, దీనిపై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వారానికి రూ. 2 లక్షల ఒప్పందంపై ప్రియ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారట. దాన్ని బట్టి ఆమె రూ. 14లక్షలు పొందినట్లు తెలుస్తుంది. అయితే బయట ఆమె మార్కెట్ తో పోల్చితే ఏడు వారాలకు ఈ పారితోషికం తక్కువే అని  సమాచారం. ఆ విధంగా చూస్తే ఆమెకు రెమ్యూనరేషన్ పరంగా దక్కింది తక్కువే. అయితే షోకి ఉన్న ఆదరణ రీత్యా ఫేమ్ తెచ్చుకోవడం ద్వారా, అవకాశాలు పెరుగుతాయని ఆమె హౌస్ కి వెళ్లినట్లు వినికిడి. 
 

click me!