'మన్మథుడు 2'లో సమంత, చైతు

Published : Apr 05, 2019, 03:26 PM IST
'మన్మథుడు 2'లో సమంత, చైతు

సారాంశం

అక్కినేని నాగార్జున నటించిన 'మన్మథుడు' సినిమాకి సీక్వెల్ రాబోతుంది. దాదాపు పదిహేడేళ్ల తరువాత సీక్వెల్ ప్లాన్ చేశారు. ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నారు. 

అక్కినేని నాగార్జున నటించిన 'మన్మథుడు' సినిమాకి సీక్వెల్ రాబోతుంది. దాదాపు పదిహేడేళ్ల తరువాత సీక్వెల్ ప్లాన్ చేశారు. ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నారు. నాగ్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.

నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ కి సిద్ధమవుతోంది. దీనికోసం చిత్రబృందం పోర్చుగల్ కి వెళ్లనుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమాలో సమంత, చైతన్య కనిపించనున్నారనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అయితే వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో స్పష్టత లేనప్పటికీ క్లైమాక్స్ లో ఈ జంట కనిపించి ఆడియన్స్ ని త్రిల్ చేయడం ఖాయమని చెబుతున్నారు.ఇక ఈరోజు చై-సామ్ నటించిన 'మజిలీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

నాగార్జునతో పాటు చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.  

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..