మ్యూజిక్ వింటూ, డాన్స్ చేస్తూ...  వైరల్ గా సమంత ఇంస్టాగ్రామ్ వీడియో

By team teluguFirst Published Jul 14, 2021, 3:39 PM IST
Highlights

విమర్శల సంగతి ఎలా ఉన్న ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ అనేక రికార్డ్స్ కొల్లగొట్టింది. కాగా ది ఫ్యామిలీ మాన్ 2 సెట్స్ లో సమంత ఎలా ఎంజాయ్ చేసేవారో వీడియో విడుదల చేసింది సమంత.

ది ఫ్యామిలీ మాన్ 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది సమంత. లేడీ టెర్రరిస్ట్ గా ఛాలెంజింగ్ రోల్ లో దుమ్ము రేపిన సమంత, డెబ్యూ డిజిటల్ సిరీస్ తోనే తన మార్కు చూపించారు. ఫ్యామిలీ మాన్ 2లో సమంత చేసిన రాజీ పాత్ర అనేక విమర్శలకు గురైంది. తమిళ ప్రజలు ఈ సిరీస్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. విడుదలకు ముందు, తర్వాత కూడా ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ అనేక విమర్శలకు లోనైంది. కొందరు తమిళ నటులు సమంతను సూటిగా విమర్శించారు. 


విమర్శల సంగతి ఎలా ఉన్న ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ అనేక రికార్డ్స్ కొల్లగొట్టింది. కాగా ది ఫ్యామిలీ మాన్ 2 సెట్స్ లో సమంత ఎలా ఎంజాయ్ చేసేవారో వీడియో విడుదల చేసింది సమంత. షూటింగ్ సెట్స్ లో షాట్స్ మధ్య విరామంలో మ్యూజిక్ వింటూ, డాన్స్ చేస్తూ చిల్ అవుతుంది సమంత. హాలీవుడ్ ఆల్బమ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్న సమంత త్రో బ్యాక్ వీడియో వైరల్ గా మారింది. 

ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సక్సెస్ నేపథ్యంలో సమంత మరిన్ని ఆఫర్స్ దక్కించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమంత వాటిలో ఆచితూచి ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట. మరోవైపు ఆమె గుణశేఖర్ శాకుంతలం మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా శాకుంతలం తెరకెక్కుతుంది. ఈ మూవీ కోసం హైదరాబాద్ లో ప్రత్యేకమైన సెట్స్ ఏర్పాటు చేశారు. 


సమంత చేస్తున్న మొదటి మైథలాజికల్ మూవీ శాకుంతలం కావడం విశేషం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ బ్రేక్ పడగా, తిరిగి ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేశారు. శాకుంతలం చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 
 

click me!