భల్లాలదేవ షేప్ కోసం కండలు పెంచుతున్న రానా...!

Published : Jul 14, 2021, 02:42 PM IST
భల్లాలదేవ షేప్ కోసం కండలు పెంచుతున్న రానా...!

సారాంశం

భల్లాల దేవగా బాహుబలి చిత్రంతో రానా పాత్ర మరువలేం. మరలా ఆ తరహా శరీరాన్ని రానా పెంపొందిస్తున్నట్లు తెలుస్తుంది. 

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి చాలా సన్నబడిన విషయం తెలిసిందే. ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తిన నేపథ్యంలో అమెరికా వెళ్లి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అమెరికా నుండి తిరిగి వచ్చిన రానా గుర్తు పట్టలేనంత సన్నగా కనిపించారు. అనంతరం ఆయన మిహికా బజాజ్ ని వివాహం చేసుకోవడం జరిగింది. ఏడాదికి పైగా రానా బక్కపలచటి శరీరంలోనే కనిపిస్తున్నారు. 


అయితే బాహుబలి సినిమా కోసం ఆయన విపరీతంగా కండలు పెంచారు. ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు కావడంతో కండల శరీరంలో దున్నుపోతుతో తలపడుతుంటే, నిజంగానే ఢీకొట్టిన భావన కలిగింది. భల్లాల దేవగా బాహుబలి చిత్రంతో ఆయన పాత్ర మరువలేం. మరలా ఆ తరహా శరీరాన్ని రానా పెంపొందిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా రానా తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ ఇచ్చేశారు. నరాలు తేలి, రాయిలా ఉన్న తన బైసెప్ చూపిస్తూ, రానా వీడియో పోస్ట్ చేశారు. 


వెల్కమ్ బ్యాక్ ఓల్డ్ ఫ్రెండ్ అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. దీనితో రానా మరలా కండలు పెంచుతున్నట్లు తెలుస్తుంది. మరి ఏదైనా చిత్రం కోసమా లేక ఫిట్నెస్ కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. దర్శకుడు గుణశేఖర్ రానాతో హిరణ్యకశిప ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఆ మూవీ హోల్డ్ లో పడింది. ప్రస్తుతం రానా నటించిన విరాటపర్వం విడుదల కావాల్సివుంది. 
 

PREV
click me!

Recommended Stories

Kajal Aggarwal: బాత్‌ రూమ్‌ని కూడా వదలని కాజల్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది