ఇంట్లో కొత్త ఫ్యామిలీ మెంబర్.. సమంతకు తప్పని అగచాట్లు!

By telugu teamFirst Published Sep 11, 2021, 4:00 PM IST
Highlights

సమంత ఇంట్లోకి కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చింది. ఆ ఫ్యామిలీ మెంబర్ తో సమంతకు తిప్పలు తప్పడం లేదు.

సౌత్ క్రేజీ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. రీసెంట్ గా సమంత గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే తాను నటిస్తున్న శాకుంతలం చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో సామ్ కొంత బ్రేక్ తీసుకుంది. 

తాజాగా సమంత ఇంట్లోకి కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చింది. ఆ ఫ్యామిలీ మెంబర్ తో సమంతకు తిప్పలు తప్పడం లేదు. సమంతకు పెట్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే సమంత ఓ కుక్కని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో చై సామ్ ఇద్దరూ ఆ కుక్కకి బర్త్ డే కూడా సెలెబ్రేట్ చేశారు. 

తాజాగా సమంత ఇంట్లోకి మరో క్యూట్ కుక్క పిల్ల వచ్చింది. ఇంట్లో ఆ కుక్కపిల్ల చేస్తున్న రచ్చ గురించి సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఒక తల్లిలా మారి సామ్ ఆ కుక్క పిల్లకు సేవలు చేస్తోంది. ఆ కుక్క ఇల్లు మొత్తం తిరుగుతూ మూత్రం పోస్తోందట. అది శుభ్రపరచడానికే తన టైం మొత్తం అయిపోతోందని, కనీసం కాఫీ తాగే తీరిక కూడా లేదని సామ్ ఫన్నీగా పోస్ట్ పెట్టింది. 

క్యూట్ గా ఉన్న తన పెట్స్ ఫోటోస్ ని సామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్లాక్ కలర్ లో ఉన్న కొత్త పెట్ ముద్దొచ్చే విధంగా ఉంది. సమంత పోస్ట్ కి ఊర్వశి రౌటేలా లాంటి బాలీవుడ్ సెలెబ్రటీలు కూడా ఫిదా అవుతున్నారు. 

ఇదిలా ఉండగా చైసామ్ మధ్య విభేదాల గురించి కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సమంత, చైతు దీనిపై స్పందించలేదు. సోషల్ మీడియాలో సమంత తన పేరులో నుంచి అక్కినేని తొలగించింది. అప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by S (@samantharuthprabhuoffl)

click me!