సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై ఆర్పీ పట్నాయక్, తెలంగాణ ఐటీ డైరెక్టర్ దిలీప్ మధ్య వార్

By telugu teamFirst Published Sep 11, 2021, 2:32 PM IST
Highlights

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ అదుపుతప్పడంతో తేజు పడిపోయాడు.

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ అదుపుతప్పడంతో తేజు పడిపోయాడు. దీనితో గాయాలపాలైన తేజు ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తేజుకు ఎలాంటి ప్రమాదం లేదని కాకపోతే చికిత్స అవసరం అని వైద్యులు అంటున్నారు. 

ఇదిలా ఉండగా తేజు ప్రమాదానికి గురికావడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతివేగం వల్లే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురైనట్లు కొందరు చెబుతుంటే.. మరికొందరు మాత్రం ప్రమాద స్థలంలో రోడ్డుపై ఇసుక, మట్టి పేరుకుని ఉండడం వల్ల తేజు స్కిడ్ అయ్యాడని అంటున్నారు. పక్కనే కంస్ట్రక్షన్ జరుగుతుండడంతో అక్కడ రోడ్డుపై ఇసుక ఉంది. అయితే సాయిధరమ్ తేజ్ అతివేగంతో బైక్ నడిపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read:ఏరా హెల్మెట్ కొన్నావా.. సాయిధరమ్ తేజ్ ని పవన్ అడిగిన మొదటి ప్రశ్న

తేజు ప్రమాదానికి గురికావడంపై సెలెబ్రిటీలు వరుసగా స్పందిస్తున్నారు. తేజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పేస్ బుక్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

'సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు, అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకు పోవడానికి కారణమైన అక్కడ ఉన్న  కంస్ట్రక్షన్ కంపెనీపై మరియు ఎప్పటికప్పుడు రోడ్డుని క్లీన్ గా ఉంచాల్సిన మున్సిపాలిటీ పై కూడా కేసు పెట్టాలి. ఈ కేసు వల్ల నగరంలో మిగతా ఏరియాల్లో ఇలాంటి అజాగ్రత్తలు పాటించేవాళ్లు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారు అని నా అభిప్రాయం' అం ఆర్పీ పట్నాయక్ పేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. 

Also Read: సాయి ధరమ్ తేజ్ ను ప్రశ్నిస్తాం: డిసీపీ, నరేష్ ఇంటి నుంచి వెళ్లడంపై ఆరా

ఆర్పీ పట్నాయక్ పోస్ట్ కు తెలంగాణ ఐటి డైరెక్టర్ కొణతం దిలీప్ కౌంటర్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. 'ప్రమాదం జరిగినప్పుడు ఆయన బైక్ అతి వేగంగా నడుపుతున్నాడు అని సిసి టివి ఫుటేజ్ స్పష్టంగా చూపిస్తోంది. అయినా కూడా ఆర్పీ పట్నాయక్ అక్కడ రోడ్డు మీద ఇసుక ఉందని ఒక అబద్ధపు ఆరోపణ చేయడం దురదృష్టకరం. సమాజంలో కొంత గౌరవం ఉన్న వ్యక్తులు ఇట్లా అబద్ధపు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు' అని కొణతం దిలీప్ కౌంటర్ ఇచ్చారు. 

 

click me!