కాకినాడలో అల్లు అర్జున్.. ఫ్యాన్స్ కోలాహలం!

Published : Sep 11, 2021, 03:06 PM ISTUpdated : Sep 11, 2021, 03:09 PM IST
కాకినాడలో అల్లు అర్జున్.. ఫ్యాన్స్ కోలాహలం!

సారాంశం

నేటి నుండి తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో పుష్ప చివరి షెడ్యూల్ ప్లాన్ చేశారు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాకినాడలో సందడి చేశారు. పుష్ప షూటింగ్ కోసం అక్కడకు వెళ్లిన ఆయన అభిమానులకు అభివాదం చేశారు. నేటి నుండి తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో పుష్ప చివరి షెడ్యూల్ ప్లాన్ చేశారు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. ఈనెల చివరి వరకు జరగనున్న ఈ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తి చేయనున్నారట దర్శకుడు సుకుమార్. 

అయితే నేటి షెడ్యూల్ భారీ వర్షం కారణంగా వాయిదా పడినట్లు సమాచారం అందుతుంది. దీనితో టీమ్ తిరిగి కాకినాడ చేరుకున్నారట. అల్లు అర్జున్ రాక గురించి తెలుసుకున్న అభిమానులు ఆయన వాహనం చుట్టూ గుమిగూడారు. నినాదాలతో హోరెత్తించారు. తన కారు ఓపెన్ టాప్ నుండి అల్లు అర్జున్, ఫ్యాన్స్ కి అభివాదం చేశారు. కాకినాడలో అల్లు అర్జున్ కి ఆర్మీ పేరుతో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. 


కాకినాడ టౌన్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా అల్లు అర్జున్ వ్యక్తిగత, సినిమా వేడుకలు నిర్వహిస్తారు. మరో వైపు సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురికావడంతో తీవ్రంగా గాయపడి, చికిత్స తీసుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో ధరమ్ కి చికిత్స జరుగుతుండగా, పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు వంటి కుటుంబ పెద్దలతో పాటు కుటుంబ సభ్యులందరూ ఆసుపత్రికి వెళ్ళి, ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే షూటింగ్ బిజీలో ఉన్న అల్లు అర్జున్ మాత్రం, హైదరాబాద్ రాలేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం
Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా