అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమంత.. స్పందించిన మేనేజర్‌..

Published : Nov 24, 2022, 01:04 PM ISTUpdated : Nov 24, 2022, 01:59 PM IST
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమంత.. స్పందించిన మేనేజర్‌..

సారాంశం

సమంత మరోసారి అనారోగ్యానికి గురయ్యారని, ఆమె ఆసుపత్రిలో చేరారనే వార్త వైరల్‌ అవుతున్న నేపథ్యంలో మేనేజర్‌ స్పందించారు. మరోవైపు `యశోద` మూవీకి కోర్ట్ షాకిచ్చింది. 

సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మయో సైటిస్‌ అనే అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతుంది. కండరాల బలహీనతకు సంబంధించిన వ్యాధి ఇది. ఈ విషయాన్ని అక్టోబర్‌ చివరి వారంలో సమంత వెల్లడించింది. `యశోద` విడుదలకు ముందు ఈ విషయాన్ని చెప్పి సింపథి కొట్టేసింది. ఆ తర్వాత కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా విజయవంతంగా రన్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే తాజాగా సమంత మరోసారి అనారోగ్యానికి గురైందని, ఆసుపత్రిలో చేరిందనే వార్తలు ఊపందుకున్నాయి. ప్రధానంగా తమిళ మీడియాలో ఈ న్యూస్‌ గుప్పుమంది. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటుందని రాసుకొచ్చారు. కోలీవుడ్‌లో ఈ వార్తలు వైరల్‌గా మారిన నేపథ్యంలో తాజాగా సమంత మేనేజర్‌ స్పందించారు. అవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు. సమంత ఆరోగ్యంగానే ఉన్నారని, ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు. పుకార్లకి పుల్‌ స్టాప్‌ పెట్టాలని వెల్లడించారు. 

ఇదిలా ఉంటే `యశోద` సినిమాకి షాకిచ్చింది కోర్ట్. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ ని ఆపాలంటూ సిటీ సివిల్ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 19 వరకు తదుపరి విచారణ జరుపనున్నట్టు తెలిపింది. నవంబర్‌ 11న `యశోద` సినిమా థియేటర్లలో విడుదలైంది. విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబర్‌ రెండో వారం(డిసెంబర్‌9న) ఓటీటీ స్ట్రీమింగ్‌ కానుందని తెలుస్తుంది. ఓటీటీ రిలీజ్‌ని ఆపాలని కోర్టు వెల్లడించింది. 

సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కి `ఈవా`అనే పేరు పెట్టారు. అందులో అక్రమాలు జరుగుతున్నట్టుగా సినిమాలో చూపించారు. సినిమాలో తమ ఆసుపత్రి పేరు చూపించడం పట్ల తమ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ `ఈవా ఆస్పిటల్‌` యాజమాన్యం సిటీ సివిల్‌ కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సినిమా ఓటీటీ విడుదలను అడ్డుకోవాలని కోరింది. దీంతో యశోద సినిమాని డిసెంబర్ 19 వరకు ఓటీటీలో ప్రదర్శించకూడదని నిర్మాణ సంస్థని కోర్ట్ ఆదేశించింది. తదుపరి విచారన డిసెంబర్‌ 19కి వాయిదా వేసింది.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Demon Pavan: రీతూ చౌదరికి రూ.5 లక్షల గిఫ్ట్ ? నాగార్జునకి మైండ్ బ్లాక్.. అందరి ముందు రివీల్ చేశాడుగా..
Niharika: చిరంజీవి డ్రీమ్ ని ఫుల్‌ ఫిల్‌ చేసిన నిహారికా.. ఏం చేసిందంటే