ఇదేం ట్విస్ట్ : “వీరసింహా రెడ్డి” సాంగ్ లీక్.. ఆ పాట కాపీనా!

By Surya PrakashFirst Published Nov 24, 2022, 12:11 PM IST
Highlights


 నందమూరి నటసింహ నందమూరి బాలయ్య హీరోగా నటిస్తున్న చిత్రం పవర్ ఫుల్ ఏక్షన్ ఎంటర్టైనర్ “వీరసింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే.   ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు.  

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విషయంలో  లీకులు పరంపర కొనసాగుతుంది. జాగ్రత్తలు తీసుకోరా అంటూ అభిమానులు ఎంత  అసహనం వ్యక్తం చేసినా పట్టించుకున్నట్లు కనపడరు. ‘మైత్రి’ వారు నిర్మించే సినిమాలకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ చాలా మందికి సందేహం వస్తుంది. “వీరసింహా రెడ్డి” కి సంబంధించి ఆన్ లొకేషన్ పిక్స్ వంటివి లీక్ అయ్యాయి.

కేవలం ఫొటోలే కాకుండా సాంగ్  వీడియోలు కూడా లీక్ అవుతున్నాయి.అందులో  హీరో ఇంట్రడక్షన్ లాంటి “జై బాలయ్య” సాంగ్ కూడా ఉండడం గమనార్హం.   ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అవుతోంది. అందుకు కారణం ఈ సాంగ్ వీడియో రూపంలో లీక్ అవటమే. అదే సమయంలో  థమన్ మరోసారి కాపీ ట్యూన్ కొట్టి దొరికేసాడు అనే ప్రచారం జరుగుతోంది. ఈ లీక్ పాట వింటే నిజమే అనిపిస్తోంది.  

ఇంతకీ  ఈ సాంగ్ ..ఏ పాటను పోలి ఉందంటే...గతంలో విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన  భారీ హిట్ చిత్రం ‘ఒసేయ్ రాములమ్మ” చిత్రం టైటిల్ సాంగ్ లా ఉంది. ఆ  బీట్ ని అచ్చం థమన్ జై బాలయ్య అంటూ దింపేసాడని ఆ లీక్ వీడియో వింటే అర్దమవుతోంది.  దీనితో  నందమూరి అభిమానులు..ధమన్ ఇలా చేసాడేంటి..గోపీచంద్ మలినేని అయినా చెప్పచ్చుగా అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే థమన్ గతంలో అఖండ చిత్రానికి ఎక్సార్డనరీ మ్యూజిక్ ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్ లో థమన్ షేర్ ఉందనటంలో సందేహం లేదు. దాంతో ఈ మాస్ సినిమాలోనూ థమన్ ..అదిరిపోయే పాటలు ఇస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఒరిజనల్ పాటలు ఇస్తే బాగుండును అంటున్నారు.
 
ఇదిలా ఉంటే ఇది సినిమాతో పాటు పోటీగా రిలీజ్ అవుతున్న  చిరంజివి ‘వాల్తేర్ వీరయ్య’నుంచి ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ సాంగ్ రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సంక్రాంతికి  వెండితెరపై సృష్టించబోయే మాస్ ప్రభంజనంకు సాక్ష్యంగా నిలిచింది. బాస్ పార్టీ.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుంది.

click me!