ప్రభాస్‌ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్?.. ఇంతకి అది ఎప్పుడు?

Published : Nov 24, 2022, 12:02 PM IST
ప్రభాస్‌ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్?.. ఇంతకి అది ఎప్పుడు?

సారాంశం

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమాల విషయంలో జోరు పెంచుతున్నా, ఒప్పుకున్నవి మాత్రం కంప్లీట్‌ చేయడం లేదు. ఈ నేపథ్యంలో తాజా గా ఆయన మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. గ్యాప్ దొరికినప్పుడు ఆయన సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం చాలా సార్లు వాయిదాలు పడుతూ వస్తోంది. ఎట్టకేలకు షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాని త్వరగా కంప్లీట్‌ చేయాలనే ఆలోచనలో పవన్‌ ఉన్నారట. అదే సమయంలో హరీష్‌ శంకర్‌తో చేయాల్సిన `భవదీయుడు భగత్ సింగ్‌` సినిమాని కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కించబోతున్నట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే లేటెస్ట్ సమాచారం మేరకు మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ప్రభాస్‌ దర్శకుడితో సినిమా చేసేందుకు పవన్‌ సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తుంది. ప్రభాస్‌తో `సాహో` చిత్రాన్ని తెరకెక్కించిన సుజిత్‌ దర్శకత్వంలో పవన్‌ సినిమా చేయబోతున్నారనే వార్త హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆ మధ్య సుజిత్‌ పవన్‌కి ఓ కథ వినిపించారట. అది నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, అంతేకాదు లంచ్‌కి కూడా పవన్‌ ఆహ్వానించారట. అయితే ఇదంతా త్రివిక్రమ్‌ సమక్షంలోనే జరుగుతుందని సమాచారం. 

ఓ డైరెక్టర్‌ చెప్పిన కథ నచ్చడంతోపాటు ఏకంగా లంచ్‌కి కూడా ఆహ్వానించడమంటే ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ కన్ఫమ్‌ అయిపోయినట్టే అని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే చాలా రోజులుగా సుజిత్‌ పేరు వినిపిస్తుంది. కానీ ఇన్నాళ్లకి అది ఓకే అయ్యిందట. మరి ఇందులో నిజమెంతా అనేది అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్‌ చేస్తున్న రెండు సినిమాలు పూర్తి కావడానికి మరో ఏడాది పట్టే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఏపీలో ఎలక్షన్ల సందడి స్టార్ట్ అవుతుంది. మరి సుజిత్‌తో సినిమా ఎప్పుడు ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది. 

ఇక `హరిహర వీరమల్లు` చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తుండగా, నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఏఎం రత్నం నిర్మాణంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వీరమల్లు పాత్రలో పవన్‌ కనిపించబోతున్నారు. మరోవైపు సుజిత్‌ `సాహో` చిత్రంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. చిన్నగా ప్రారంభమైన ఆ సినిమాని హాలీవుడ్‌ రేంజ్‌కి మార్చేశారు. బడ్జెట్‌ భారీగా పెంచడంతో చివరికి కలెక్షన్ల పరంగా నిరాశ పరిచింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు