
ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు సందడి చేయనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్గా రన్ రాజా రన్ ఫేం సీరత్ కపూర్ను ఎంపిక చేయగా మరో కీలక పాత్రకు స్టార్ హీరోయిన్ సమంతను ఫిక్స్ చేశారు. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. గతంలో నాగార్జున, సమంతలు మనం సినిమాలో కలిసి నటించారు. రాజుగారి గది 2లో కూడా నాగ్, సమంత పాత్రలు మనం తరహాలోనే ఉండే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.