
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రపంచం అంతా ఖండిస్తుంది. అన్యాయంగా పసికూన లాంటి దేశాన్ని నాశనం చేస్తున్నారంటూ.. రష్యాపై దుమ్మెత్తి పోస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఇక మన సినీ సెలబ్రిటీ నుంచి కూడా ఉక్రేయిన్ కు సపోర్ట్ లభిస్తుంది.
రష్యా లాంటి అగ్రదేశానికి ఎదురు నిలిచి.. వీరోచితంగా పోరాడుతున్నారు ఉక్రేయిన్ సైనికులు,ప్రజలు. వారందరిని ముందుండి నడిపిస్తూ..ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు ఉక్రేయిన్ అధ్యక్షుడు వ్లాదమిర్ జెలెస్ స్కీ. ప్రపంచం అంతా ఆయన వీరోచిత పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నారు. చిన్న దేశం అయినా.. తమ హక్కుల కోసం అగ్రరాజ్యంతో ఢీ అంటే.. ఢీ అంటుంది. అందరి దృష్టిలో రియలో హీరోగా నిలిచిన జెలెస్ స్కీకి మన ఇండియన్ తారల నుంచి మద్దతు లభిస్తుంద.
ఇప్పటికే పలువురు సినీ తారలు రష్యా తీరును తప్పుపట్టారు. బాహుబలిలాంటి రష్యా పసికూన ఉక్రెయిన్‌పై మూకుమ్మడిగా దాడిచేస్తోందని ఖండించారు. ప్రియాంక చోప్రా, ఆ మధ్య ఈ విషయంలో స్పందించి ఉక్రేయిన్ కు సపోర్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా ఉక్రేయిన్ గురించి స్పందించారు.
సమంత సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఏ కారణాలతో యుద్ధం వచ్చినా అది పౌరుల, సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడమేనన్నారు సమంత ఇక ఇదే విషయమై రెండు రోజుల క్రితం స్పందించిన సమంత తాజాగా మరోసారి ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్టు షేర్ చేశారు.ఈ సారి ఉక్రేయిన్ కోసం ఎంతో పోరాటం చేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ గురించి గొప్పగా పోస్ట్ చేశారు సమంత.
యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది.. అతని తెగువ, ధైర్యసాహసాలే దానికి సాక్ష్యం అంటూ.. ఓ పత్రికలో రాసిన న్యూస్ ఆర్టికల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ని ఆమె షేర్ చేసింది. సమంత ఒక్కతే కాదు ఆమె తో పాటు బాలీవుడ్ హీరోయిన్ అమీ జాక్సన్ సైతం ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతలపై రియాక్ట్ అయింది. బాధిత దేశంలో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు సాయం అందించాలని ఆమె ప్రజలను వేడుకుంది.
ఉక్రేయిన్ లో తాజా పరిస్థితుల ను తెలిపేలా పోస్ట్ పెట్టింది అమీ జాక్సన్ . అప్పుడే పుట్టిన బిడ్డలకు ఎన్ని కష్టాలో.. అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు ఉక్రెయిన్‌లోని ఓ హాస్పిటల్ ఐసీయూ నుంచి ఓ శిశువులను బాంబ్ షెల్టర్‌లోకి తీసుకువెళ్తున్న వీడియోను ఆమె షేర్ చేసింది.