
మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఆరుపదుల వయసులో చిరు కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తుండడం విశేషం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాగే మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ మూవీ కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి 'భోళా శంకర్' అనే మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. నేడు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ భోళా శంకర్ లో చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
మెగాస్టార్ స్టైల్, యాటిట్యూడ్ తో ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. జీప్ ముందు భాగంలో చిరంజీవి సూపర్ స్టయిలిష్ గా కూర్చుని ఫోజు ఇస్తున్నారు. చేతిలో త్రిశూలాన్ని పోలిన కీ చైన్ తిప్పుతూ కాలు మీద కాలేసుకుని కూర్చున్న ఫోజు అదిరిపోయే విధంగా ఉంది. ఈ లుక్ లో చిరంజీవి వయసు తగ్గి యంగ్ గా కనిపిస్తున్నారు.
అభిమానులు చిరంజీవి మాస్ అండ్ స్టైలిష్ వైబ్స్ ఫీల్ అయ్యేలా ఫస్ట్ లుక్ రూపొందించారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవికి జోడిగా నటిస్తోంది.
రావు రమేష్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, శ్రీముఖి, ప్రగతి, గెటప్ శ్రీను, రష్మీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.