స్టార్ హీరో చెప్పాడని పేరు మార్చేసుకున్న హీరోయిన్.. కారణం ఇదే!

Published : May 09, 2019, 06:19 PM IST
స్టార్ హీరో చెప్పాడని పేరు మార్చేసుకున్న హీరోయిన్.. కారణం ఇదే!

సారాంశం

భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో కూడా పాపులర్ అయింది. కియారా ప్రస్తుతం బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనిత ష్రాఫ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ చాట్ షోలో కియారా అద్వానీ ఇటీవల పాల్గొంది. ఈ షోలో కియారా తన పేరు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.   

కియారా అద్వానీ అసలు పేరు అది కాదట. కియారా అద్వానీకి ఆమె తల్లిదండ్రులు పెట్టిన పేరు అలియా. ఈ సీక్రెట్ లో కియారా తొలిసారి బయట పెట్టింది. తాను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న సమయంలో సల్మాన్ ఖాన్ పేరు మార్చుకోమని సూచించారట. బాలీవుడ్ లో ఆల్రెడీ అలియా భట్ ఉంది. అదే పేరుతో నీవు కూడా ఇండస్ట్రీలోకి రావడం కరెక్ట్ కాదు. పేరు మార్చుకో.. అని సల్మాన్ సూచించాడట. 
 
సల్మాన్ ఖాన్ పేరు మార్చుకోమని మాత్రమే చెప్పారు. కియారా అనే పేరుని ఎంచుకుంది మాత్రం నేనే అని ఈ బాలీవుడ్ బ్యూటీ అంటోంది. ప్రస్తుతం తన తల్లిదండ్రులు కూడా పాత పేరు మరచిపోయి కియారా అనే పిలుస్తున్నారట. మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ చిత్రం ఎంఎస్ ధోని ద్వారా కియారాకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత మహేష్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాన్ని అందుకుంది. 
 
కియారా ప్రస్తుతం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది. కబీర్ సింగ్ చిత్రానికి కూడా సందీప్ వంగానే దర్శకుడు. కబీర్ సింగ్ తో పాటు గుడ్ న్యూస్, లక్ష్మి బాంబ్ లాంటి చిత్రాల్లో కియారా నటిస్తోంది. 
 
PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?