వరుస డిజాస్టర్స్.. ఇప్పుడెవరు నమ్ముతారు హను?

Published : May 09, 2019, 04:58 PM IST
వరుస డిజాస్టర్స్.. ఇప్పుడెవరు నమ్ముతారు హను?

సారాంశం

  అందాల రాక్షసి సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఇండస్ట్రీ పెద్దలను సైతం ఆకర్షించాడు. నానితో కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమా అనంతరం మనోడి దశ మారిపోయింది. 

అందాల రాక్షసి సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఇండస్ట్రీ పెద్దలను సైతం ఆకర్షించాడు. నానితో కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమా అనంతరం మనోడి దశ మారిపోయింది. గురువు చంద్రశేఖర్ యేలేటి తరహాలోనే డిఫరెంట్ సినిమాలను ట్రై చేస్తున్నాడు అని పాజిటివ్ కామెంట్స్ ను అందుకున్నాడు. 

మేకింగ్ లో కొత్తదనం చూపించే హనుకి ముందు నుంచి ఒక నెగిటివ్ కామెంట్ ఇబ్బందికి గురిచేస్తోంది. బడ్జెట్ నియంత్రణలో ఉండదని కొత్తగా ట్రై చేస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో హను రొటీన్ గానే అడుగులు వేస్తున్నట్లు ఇటీవల విమర్శలు వచ్చాయి. లై సినిమా దారుణమైన నష్టాలను మిగిల్చగా.. పడి పడి లేచే మనసు పెట్టిన డబ్బుని ఏ మాత్రం వెనక్కి తేలేకపోయింది.  

లై సినిమాను పక్కనపెడితే.. పడి పడి లేచే సినిమా పాయింట్ జనాలకు ఏ మాత్రం కనెక్ట అవ్వలేదు. పైగా సినిమాకు  30 కోట్లవరకు ఖర్చయిందని తెలియడంతో  హను దగ్గరికి మరో నిర్మాత రాలేదు. మళ్ళీ ఈ దర్శకుడికి అవకాశం వస్తుందా అనేది అనుమానంగానే ఉంది. అయితే హను మాత్రం నిరాశ చెందకుండా మళ్ళీ కొత్త కథను రెడీ చేసుకుంటున్నాడు

ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో 1970 కాలానికి సంబందించిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ తరహాలో స్క్రిప్ట్ ను రెడీ చేసుకుంటున్నాడు. వచ్చే ఏడాది లోపు ఈ ప్రాజెక్ట్ ను ఎలాగైనా సెట్స్ పైకి తీసుకెళ్లాలని హను ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చివరిదశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు హనురాఘవపుడి కథను నమ్మి అంత బడ్జెట్ పెట్టె నిర్మాత ఎవరో చూడాలి?  

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం