మీ డాన్స్ లు , స్టయిల్‌ అద్భుతం.. లవ్యూ బ్రో.. అల్లు అర్జున్‌కి సల్మాన్‌ ఖాన్‌ బిగ్‌ థ్యాంక్స్

Published : Apr 26, 2021, 12:30 PM IST
మీ డాన్స్ లు , స్టయిల్‌ అద్భుతం.. లవ్యూ బ్రో.. అల్లు అర్జున్‌కి సల్మాన్‌ ఖాన్‌ బిగ్‌ థ్యాంక్స్

సారాంశం

`రాధే` చిత్రంలో ఈ పాటని రీమిక్స్ చేశారు. సేమ్‌ ట్యూన్‌, సేమ్‌ లిరిక్స్ తో కంపోజ్‌ చేసిన ఈ పాటలో సల్మాన్‌ ఖాన్‌, దిశా పటానీ స్టెప్పులేశారు. తాజాగా సోమవారం ఈ పాటని విడుదల చేశారు. ఈ సందర్బంగా బన్నీకి సల్మాన్‌ థ్యాంక్స్ చెప్పారు.

అల్లు అర్జున్‌, పూజా హెగ్డే నటించిన `డీజే` చిత్రంలోని `సీటీమార్‌` సాంగ్‌ ఎంతగా ఊపేసిందో తెలిసిందే. మాస్‌ బీట్‌గా సాగే ఈ పాటకి 200 మిలియన్స్ కి పైగా వ్యూస్‌ వచ్చాయి. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించడం విశేషం. తాజాగా ఈ పాటని హిందీలోకి తీసుకెళ్లారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా రూపొందిన `రాధే` చిత్రంలో ఈ పాటని రీమిక్స్ చేశారు. సేమ్‌ ట్యూన్‌, సేమ్‌ లిరిక్స్ తో కంపోజ్‌ చేసిన ఈ పాటలో సల్మాన్‌ ఖాన్‌, దిశా పటానీ స్టెప్పులేశారు. తాజాగా సోమవారం ఈ పాటని విడుదల చేశారు. ఇందులో సల్మాన్‌, దిశా తమదైన మాస్‌ స్టెప్పులతో అదరగొట్టారు. 

ఈ సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కి థ్యాంక్స్ చెప్పారు. `థ్యాంక్యూ అల్లు అర్జున్‌. సీటీమార్‌ సాంగ్‌లో డాన్స్లు వేసిన విధానం, మీ స్టయల్‌ అత్యద్భుతం. ఇది నాకు బాగా నచ్చింది. సింప్లీ ఫెంటాస్టిక్‌. జాగ్రత్తగా ఉండండి, మీరు, మీ ఫ్యామిలీ, లవ్యూ బ్రదర్‌` అని పేర్కొన్నారు సల్మాన్‌. ఓ సూపర్‌ స్టార్‌ బన్నీకి థ్యాంక్స్ చెప్పడం ఇప్పుడు మరింత వైరల్‌గా మారింది. ఈ పాటకి మరింత క్రేజ్‌ని తీసుకొచ్చింది. విడుదల చేసిన కొద్ది సేపట్లోనే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతుండటం విశేషం. 

బన్నీ సైతం సల్మాన్‌ ట్వీట్‌కి స్పందించారు. `థ్యాంక్యూ సల్మాన్‌ గారు. మీ నుంచి ఇంతటి అభినందనలు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది స్వీట్‌ గెస్చర్‌. మీరు `రాధే` కోసం సీటీమార్‌తో చేసిన మ్యాజిక్‌ కోసం అభిమానిలాగే ఎదురుచూస్తున్నా. మీ ప్రేమకి ధన్యవాదాలు` అని తెలిపారు. ఇక ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించగా, ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ విశేష స్పందనతో ట్రెండ్‌ అవుతుంది. ఇందులో దిశా అందాలు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ చిత్రాన్ని మే 13న ఈద్‌ పండుగని పురస్కరించుకుని విడుదల చేస్తున్నారు. థియేటర్లతోపాటు ఏకకాలంలో ఓటీటీలో, అలాగే డిష్‌ టీవీల్లోనూ విడుదల కానుంది. ఈ సరికొత్త విధానానికి తెరలేపి సల్మాన్‌ సంచలనం సృష్టించబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్