ఇర్ఫాన్‌ ఖాన్‌, భాను అథైయలకు ఆస్కార్‌ ఘన నివాళి..

Published : Apr 26, 2021, 09:58 AM IST
ఇర్ఫాన్‌ ఖాన్‌, భాను అథైయలకు ఆస్కార్‌ ఘన నివాళి..

సారాంశం

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌కి, భారతీయ కాస్ట్యూమ్‌ డిజైనర్‌, ఆస్కార్‌ విన్నర్‌ భాను అథైయాలకు ఆస్కార్‌ వేడుక ఘన నివాళ్లర్పించింది.

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌కి, భారతీయ కాస్ట్యూమ్‌ డిజైనర్‌, ఆస్కార్‌ విన్నర్‌ భాను అథైయాలకు ఆస్కార్‌ వేడుక ఘన నివాళ్లర్పించింది. మెమోరియం సెగ్మెంట్‌లో వీరిని గుర్తు చేసుకున్నారు. అకాడమీ మొత్తం నివాళిగా సంతాపం తెలియజేశారు. విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ పలు హాలీవుడ్‌ చిత్రాల్లో నటించి మెప్పించారు. అక్కడి ఆడియెన్స్ ని కనువిందు చేశాడు. ఆయన `లైఫ్‌ ఆఫ్‌ పై`, `జురాసిక్‌ వరల్డ్`, `ఇన్‌ఫెర్నో` వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నిరుదు ఏప్రిల్‌ 29న  కాన్సర్‌తో కన్నుమూసిన విషయం తెలిసిందే. 

ఇక ఆస్కార్‌ అవార్డు అందుకున్న తొలి ఇండియన్‌గా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ భాను అథైయా నిలిచారు. 1982లో వచ్చిన `గాంధీ` చిత్రానికి ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు. ఆ సినిమాకిగానూ ఆమెకి ఆస్కార్‌ వరించింది. ఆమె కూడా నిరుడు అక్టోబర్‌ 15న కన్నుమూశారు. ఆమె అనేక హిందీ, బెంగాలీ, హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేశారు. ఈ 93వ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో ఆమెని ప్రత్యేకంగా గుర్తు చేసుకుని నివాళ్లర్పించారు. వీరితోపాటు ఇటీవల కాలంలో చనిపోయిన `జేమ్స్ బాండ్‌` నటుడు సియాన్‌ కెన్నరి, హాలీవుడ్‌ నటుడు క్రిస్టోఫర్‌ ప్లమ్మర్‌, `బ్లాక్‌ పాంథర్‌` నటుడు చడ్విక్‌ బోసెమన్‌లకు కూడా ఆస్కార్‌ ఘన నివాళి అర్పించింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన