సీరియస్ అయిన సల్మాన్ ఖాన్.. వాళ్ళపై మండిపడిన బాలీవుడ్ కండల వీరుడు

Published : Dec 21, 2023, 07:59 AM IST
సీరియస్ అయిన సల్మాన్ ఖాన్.. వాళ్ళపై మండిపడిన బాలీవుడ్ కండల వీరుడు

సారాంశం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కోపం వచ్చింది. ఆయనకు కోపం రావడం సహజమే. కాని ఈసారి కోపాన్నిప్రదర్శించడంతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంతకీ విషయం ఏంటంటే..? 

సల్మాన్ ఖాన్ కు కోపం వచ్చింది. అవును.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కోపంతో ఊగిపోయారు. తన ఎదురుగా ఉన్న ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డారు. వేలు చూపించి బెదిరించారు. అయితే ఇదంతా సోహెల్ ఖాన్ బర్త్ డే సందర్బంగా కనిపించిన సీన్. ఇంతకీ అక్కడ ఏమయ్యిందంటే..?  సల్మాన్ ఖాన్ కు వివాదాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఆయన చాలా వివాదాలు ఫేస్  చేస్తున్నాడు. అంతే కాదు లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రాణ హాని కూడా ఉండటంతో.. సల్మాన్ ను వై కేటగిరీలో బద్రత కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 

ఇలా గవర్నమెంట్లు కూడా భద్రత ఏర్పాటు చేసేంత వివాదాలు కోరి తెచ్చుకున్న కండల వీరుడు.. చాలా సార్లు ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలిచాడు. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ పేరు వార్తల్లోకి ఎక్కింది. తాజాగా సల్మాన్ ఖాన్ కోప్పడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ సోహైల్ ఖాన్ బర్త్ డే వేడుకల్లో ఈ సీన్ కనిపించింది. సోహెల్ తన  పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకకు సల్మాన్‌ఖాన్‌తో సహా కుటుంబం మొత్తం హాజరయ్యారు. 

Dunki Review:డంకీ ట్విట్టర్ రివ్యూ, షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టేనా..?

అయితే పార్టీ అయిపోయి అంతావెళ్తున్నసందర్భంలో.. సల్మాన్ ఖాన్ తన తల్లి  సల్మా ఖాన్‌ చేయి పట్టుకుని మెట్లు దిగడానికి సహాయం చేస్తూ కనిపించారు. అయితే అదే టైమ్ లో.. ఫోటోగ్రాఫర్‌లు ఒక్క సారిగా ముందుకు వచ్చి.. వారిని క్యాప్చర్ చేయడానికి చూశారు. దాంతో సల్మాన్ ఒక్క సారిగా సహనం కోల్పోయారు. వారిపై  విరుచుకుపడ్డారు. కెమెరా మెన్ల పై ఆగ్రహం వ్యక్తం చేశాడు సల్మాన్ ఖాన్. సల్మాన్‌కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

 

ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. సల్మాన్ ఖాన్ చేసింది కరెక్ట్ కాదు అంటున్నారు ఎక్కువమంది.  ఇక ఈ పార్టీలో సల్మాన్ అతని తల్లితో పాటు, సల్మాన్ తండ్రి సలీం ఖాన్, అతని రెండవ భార్య హెలెన్, సోదరుడు అర్బాజ్ ఖాన్, సోదరి అర్పితా ఖాన్ , ఆమె భర్త ఆయుష్ శర్మ, అర్పిత-ఆయుష్ పిల్లలు అహిల్ , ఆయుష్ శర్మ, రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్, వత్సల్ శేత్, ఇషితా దత్తా. ఈ బర్త్ డే పార్టీలో సందడి చేశారు. 

ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే..  బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సల్మాన్. రీసెంట్ గా  టైగర్3  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అంతకు ముందు చేసిన కిసికా జాన్.. కిసికా బాయ్ కూడా ప్లాప్ ల లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం