Pallavi Prashanth: బిగ్ బ్రేకింగ్.. పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్..

Published : Dec 21, 2023, 02:20 AM ISTUpdated : Dec 21, 2023, 02:39 AM IST
Pallavi Prashanth: బిగ్ బ్రేకింగ్.. పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్..

సారాంశం

Pallavi Prashanth: బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించకుండా మెజిస్టేట్ ముందు హాజరు పరిచారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.

Pallavi Prashanth: బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిద్ధిపేట గజ్వేల్‌ మండలం కొల్లూరులోని అతని నివాసం నుంచి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్డూడియో దగ్గర గొడవ నేపథ్యంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించకుండా మెజిస్టేట్ ముందు హాజరు పరిచారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.

 ఈ తరుణంలో ఏసీపీ హరి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్డూడియో దగ్గర గొడవ నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ పై సుమోటోగా కేసు నమోదు చేశామని తెలిపారు. పల్లవి ప్రశాంత్ పోలీసులు చెప్పిన వినకుండా  పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారని పేర్కొన్నారు. ఈ ర్యాలీ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ బందోబస్తుకు వెళ్లిన పోలీసుల కార్లు సహా, ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారని తెలిపారు. 

ఈ ఘటన నేపథ్యంలో పల్లవి ప్రశాంత్‌, తదితరులపై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ క్రమంలో తొలుత అతని కారు డ్రైవర్లు  సాయికిరణ్, రాజులను అరెస్టు చేశామనీ, అలాగే బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు  మహా విరాన్ లను అరెస్టు చేసినట్టు తెలిపారు. ప్రశాంత్ ను పోలీసు స్టేషన్ కు తీసుకరాకుండా, మెజిస్టేట్ ముందు హజరు పరిచామన్నారు. ఈ క్రమంలో మెజిస్టేట్ .. పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలిపారు.ఈ కేసుపై విచారణ జరుగుతుందనీ, తదుపరి విషయాలు త్వరలో వెల్లడిస్తున్నామని అన్నారు. ఇలాంటి అసాంఘిక చర్యల్లో యువత పాల్గొనరాదని సూచించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా