ఇక నుంచి లావణ్య త్రిపాఠి కాదు.. ఇంటిపేరు మార్చేసిన హీరోయిన్

Published : Dec 21, 2023, 06:53 AM ISTUpdated : Dec 21, 2023, 06:58 AM IST
ఇక నుంచి లావణ్య త్రిపాఠి కాదు.. ఇంటిపేరు మార్చేసిన హీరోయిన్

సారాంశం

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన పేరును అప్ డేట్ చేశారు.ప్రస్తుతం మెగా ఇంటి కోడలిగా వెళ్లిన లావణ్య.. తనఇంటి పేరకు కొనిదెల టాగ్ తగిలించారు. దాంతో మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 

ఈమధ్య మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లింది టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య దాదాపు 5 ఏళ్ళుగా ప్రేమించుకున్నారు.. సీక్రెట్ గా తమ ప్రేమను కొనసాగించిన వీరు.. రీసెంట్ గా ఇరు కుటుంబాలను ఒప్పించి ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో  రీసెంట్ గానే హనీమూన్ ట్రిప్ ను కంప్లీట్ చేసుకుని ఇండియాకు చేరారు జంట. ఇక తమ షూటింగ్స్ లో బిజీ కాబోతున్నారు. 

ఈక్రమంలో వరుణ్ తేజ్  ను పెళ్లాడటంతో మెగా ఫ్యామిలీ కోడలి హోదా వచ్చింది లావణ్యకు దాంతో తన పేరును సోషల్ మీడియాలో అప్ డేట్ చేసింది బ్యూటీ. ఇన్ స్టాలో తన పేరుకు కొణిదెల ట్యాగ్ ను తగిలించింది. అంతకు ముందు లావణ్య త్రిపాఠి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ పేరు కాస్తా..లావణ్య త్రిపాఠి కొణిదెలగా మారిపోయింది. అయితే ఆమె ఇన్ స్టాలో మాత్రమే తన పేరును అప్ డేట్ చేసింది. ట్విట్టర్ ఎక్స్ లో మాత్రం ఇంకా అప్ డేట్ చేయాల్సి ఉంది. 

 

ఇక లావణ్య త్రిపాటి తన పేరుకు కొణిదెల ట్యాగ్ తగిలించడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో లావణ్య పేజ్ ను వైరల్ చేస్తున్నారు. ఈ విషయంలో ఫ్యాన్స్ నుదిల్ ఖుష్ చేసింది లావణ్య. దాంతో ఆమె ఫాలోయింగ్ కూడా ఇప్పుడు అమాంతం పెరిగే అవకాశం ఉంది. మరి పెళ్ళి తరువాత ఆమె నటిస్తుందా లేక..ఫ్యామిలీకే పరిమితం అవుతుందా..? లేక నిర్మాణ బాధ్యతలు లాంటివి చూసుకుంటుందా అనేది చూడాలి. 

Dunki Review:డంకీ ట్విట్టర్ రివ్యూ, షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టేనా..?

ప్రస్తుతానికి వరుణ్ తేజ్ షూటింగ్స్ లో యాక్టీవ్ అయ్యాడు.రీసెంట్ గా ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ కంప్లీట్ చేసిన వరుణ్ తేజ్.. ప్రస్తుతం మట్కా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తో వరుణ్ కెరీర్ ఇబ్బందుల్లో ఉంది. సాలిడ్ హిట్ పడితే కాని.. మెగా ప్రిన్స్ కెరీర్ కు మళ్ళీ జోష్ రాదు. ప్రస్తుతం ఆ పనుల్లోనే ఉన్నాడు యంగ్ హీరో. ఈసారైనా హిట్ కొడతాడో లేదో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?