తీవ్ర నష్టం తప్పదు.. జగన్ ప్రభుత్వానికి రాఘవేంద్ర రావు సంచలన లేఖ

By telugu teamFirst Published Dec 1, 2021, 8:09 PM IST
Highlights

దర్శక ధీరుడు Raghavendra Rao సంచలన లేఖతో జగన్ ప్రభుత్వనికి సూచన చేశారు. ఆన్లైన్ టికెట్ విధానం, తగ్గిన టికెట్ ధరలు, అదనపు షోలు లేకపోవడం వల్ల సినిమాని నమ్ముకున్న వారు ఎలా నష్టపోతారు అనే విషయాని రాఘవేంద్ర రావు తన లేఖలో పేర్కొన్నారు. 

సినిమా టికెట్ ధరలు, అదనపు షోల విషయంలో టాలీవుడ్ లో కదలిక మొదలయింది. టికెట్ రేట్లని తగ్గించి, ఆన్లైన్ టికెట్ విధానాన్ని తీసుకొస్తోంది ఏపీ ప్రభుత్వం. అలాగే బెనిఫిట్ షోలు, అదనపు షోలని కూడా రద్దు చేస్తూ అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఎన్ని చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. 

దీనితో నెమ్మదిగా టాలీవుడ్ లో కదలిక మొదలైనట్లు కనిపిస్తోంది. ఇటీవల మెగాస్టార్ Chiranjeevi సోషల్ మీడియా వేదికగా టికెట్ ధరలు పెంచాలని జగన్ సర్కారుని కోరారు. తాజాగా దర్శక ధీరుడు Raghavendra Rao సంచలన లేఖతో జగన్ ప్రభుత్వనికి సూచన చేశారు. ఆన్లైన్ టికెట్ విధానం, తగ్గిన టికెట్ ధరలు, అదనపు షోలు లేకపోవడం వల్ల సినిమాని నమ్ముకున్న వారు ఎలా నష్టపోతారు అనే విషయాని రాఘవేంద్ర రావు తన లేఖలో పేర్కొన్నారు. 

'చిత్ర పరిశ్రమలో 45 ఏళ్ల అనుభవం ఉన్న దర్శకుడిగా, నిర్మాతగా నా అభిప్రాయాలు అర్థం చేసుకోండి. మనం మూలాలు మరచిపోకూడదు. నేను ఈ స్థాయికి రావడానికి కారణం ప్రేక్షకులు, థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు. వీళ్ళు లేకపోతే నేను లేను. 

సినిమాని థియేటర్స్ లో చూసిన అనుభూతి టీవీలలో ఉండదు. టికెట్ ధరలు తగ్గించడం వల్ల, అదనపు షోలు రద్దు చేయడం వల్ల థియేటర్ వ్యవస్థని నమ్ముకున్న వారంతా తీవ్రంగా నష్టపోతారు. ఒక హిట్ చిత్రానికి అదనపు షోలు వేసుకోవడం వల్ల, మొదటి వారంలో రేట్లు పెంచుకోవడం వల్ల థియేటర్ యాజమాన్యానికి రెండు మూడు నెలలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. దీని వల్ల తర్వాత వచ్చే చిత్రాలు పెద్దగా ఆడకపోయినా, నష్టం వచ్చినా తట్టుకుని నిలబడగలుగుతారు. 

Also Read: ఏపీ వరద బాధితుల కోసం కదిలిన టాలీవుడ్‌.. చిరంజీవి, రామ్‌చరణ్‌, మహేష్‌ విరాళాలు..

థియేటర్ యాజమాన్యాన్ని నమ్ముకున్న వర్కర్స్ కి ఉపాధి లభిస్తుంది. చిత్ర పరిశ్రమలో 10 శాతం విజయాలు, 10 శాతం యావరేజ్ సినిమాలే ఉంటాయి. ఇది అందరికి తెలిసిన సత్యం. ఒక మంచి సినిమాని ప్రేక్షకుడు టికెట్ ధర పెంచినా చూస్తాడు. అదే నచ్చని సినిమా టికెట్ ధర కేవలం 1 రూపాయి మాత్రమే అయినా చూడడు. ఆన్లైన్ లో కూడా బ్లాక్ మార్కెట్ జరిగే అవకాశం ఉంది. టికెట్ ధరలు పెంచడం వల్ల ప్రభుత్వాలకు కూడా టాక్స్ రూపంలో ఆదాయం పెరుగుతుంది. ఈ అంశాలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భావిస్తున్నా అంటూ రాఘవేంద్ర రావు తన లేఖలో పేర్కొన్నారు. 

Also Read: మెస్మరైజ్ చేస్తున్న ప్రియమణి.. సిల్వర్ మెరుపులు అదుర్స్, 37 ఏళ్ల వయసులో చూపుతిప్పుకోలేని సోయగాలు

మరి రాఘవేంద్ర రావు లేఖతో మిగిలిన టాలీవుడ్ ప్రముఖులు కూడా టికెట్ ధరలపై గళం విప్పుతారో లేక మౌనం పాటిస్తారో చూడాలి. రేపు విడుదలవుతున్న బాలయ్య అఖండ చిత్రం మొదలుకుని సంక్రాంతి, ఆ తర్వాత కూడా పెద్ద చిత్రాలు వరుసగా క్యూ కడుతున్నాయి. 

pic.twitter.com/dRUXYVH9G6

— Raghavendra Rao K (@Ragavendraraoba)
click me!