
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)వరుస చిత్రాలు ప్రకటిస్తూ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇస్తున్నారు. అదే సమయంలో నెలల వ్యవధిలో కొత్త చిత్రాలు విడుదల చేస్తున్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన అంతిమ్ నవంబర్ 26 విడుదలైంది. ఇదే ఏడాది మే నెలలో రాధే చిత్రాన్ని సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. దర్శకుడు ప్రభుదేవా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే రాధే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది . రాధే చిత్రంలో సల్మాన్ కి జంటగా దిశా పటాని నటించారు.
ప్రస్తుతం సల్మాన్ టైగర్ 3 మూవీ చేస్తున్నారు. ఏక్తా టైగర్ చిత్రానికి ఇది సీక్వెల్ అని సమాచారం. అలాగే భాయ్ జాన్ అనే మరో చిత్రం సల్మాన్ ప్రకటించారు. ఈ మూవీలో పూజ హెగ్డే సల్మాన్ సరసన నటిస్తున్నారు. కాగా సల్మాన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. భజరంగీ భాయ్ జాన్ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నట్లు వెల్లడించారు.
2015లో విడుదలైన భజరంగీ భాయ్ (Bhajarangi bhaijaan)జాన్ సల్మాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ భజరంగీ భాయ్ జాన్ కథను అందించారు. దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించగా కరీనా కపూర్ హీరోయిన్ గా నటించారు. ఇండియాలో తప్పిపోయిన మున్నీ అనే పాకిస్థాన్ బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చే ఇండియన్ గా సల్మాన్ నటించారు. సల్మాన్ ఇన్నోసెంట్ ఆంజనేయుడు భక్తుడిగా అద్భుత నటనతో ఆకట్టుకున్నారు.
కాగా ఈ సూపర్ హిట్ మూవీకి సల్మాన్ సీక్వెల్ ప్రకటించారు. భజరంగీ భాయ్ జాన్ 2 చేయనున్నట్లు తెలియజేశారు. ఇక భజరంగీ భాయ్ జాన్ సీక్వెల్ కి కూడా విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చనున్నారు. ఇక ప్రకటనతోనే మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. వచ్చే ఏడాది ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
Also read RRR Pre Release Event: ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ.. ముంబయిలో రామ్, భీమ్ భారీ కటౌట్లు
ఇక నిన్న ముంబై వేదికగా జరిగిన ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ వేడుకలో సల్మాన్ సందడి చేశారు. ముఖ్య అతిథిగా హాజరై ఆర్ఆర్ఆర్ మూవీ నార్త్ ఇండియన్స్ కి మరింత చేరువయ్యేలా చేశారు. ఆర్ఆర్ఆర్ (RRR movie)ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ హాజరుకావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. దర్శకుడు రాజమౌళితో పాటు అజయ్ దేవ్ గణ్, ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు.