Salaar : టీజర్ సృష్టించిన బీభత్సానికి.. తెలుగు స్టేట్స్ లో ‘సలార్’కు భారీ డిమాండ్?

By Asianet News  |  First Published Jul 9, 2023, 2:40 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలని ‘సలార్’ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. టీజర్ సృష్టించిన బీభత్సానికి సినిమా డిమాండ్ భారీ పెరిగిపోయింది. తెలుగు స్టేట్స్  ట్రేడ్ సర్కిల్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గ్గా మారింది.
 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)   ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్స్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’తో వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా సత్తా చూపించబోతున్నారు. ముందుగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)   దర్శకత్వం వహించిన Salaar Ceasefire విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్  నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మొన్నటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని యూనిట్.. టీజర్ తో సెన్సేషనల్ అప్డేట్స్  అందించేందుకు ప్లాన్ రెడీ చేశారు. 

ఈ క్రమంలో జూలై 6న సలార్ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికీ  రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది. ఈ క్రమంలో సినిమాపై భారీ అంచనాలు పెరగడంతో పాటు ట్రేడ్ సర్కిల్ లోనూ డిమాండ్ పెరిగింది. తాజా సమాచారం ప్రకారం.. ట్రేడ్ వర్గాల అంచనా మేరకు సలార్ తెలుగు స్టేట్స్ లో భారీ ధరకు కొనుగోలు కానుందని తెలుస్తోంది. 

Latest Videos

రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.200 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయబోతోంది. ఇప్పటికే నైజాంలో రూ.72 కోట్లకు, సీడెడ్ లో రూ.35 కోట్లకు, ఆంధ్రాలో రూ.80 కోట్లకు సలార్ థియేట్రికల్ రైట్స్ ను అడిగినట్టు తెలుస్తోంది. దీంతో నమొత్తంగా తెలంగాణ, ఏపీలో కలిసి రూ.197 వరకు బిజినెస్ కానుందని ట్రేడ్ పెద్దలు తెలుపుతున్నారు. తెలుగు స్టేట్స్ లోనే ఈస్థాయిలో డిమాండ్ ఉంటే.. ఇక మిగితా ఏరియాల్లో కలిపితే టోటల్ బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం ఖాయమని రీసెంట్ గా సప్తగిరి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ టార్గెట్ దిశగానే మేకర్స్ కూడా  సినిమాను తీసుకెళ్తుండటం విశేషం.

ఇక ఆగస్టు నుంచి ‘సలార్’ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ అందనున్నాయి. వచ్చేనెలలోనే పవర్ ఫుల్ ట్రైలర్ కూడా రాబోతోంది. అప్పటి నుంచి ప్రమోషన్స్  ను జోరుగా నిర్వహించేలా యూనిట్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది. ఈ చిత్రం రెండు పార్టులుగా రానుంది. ప్రభాస్ - శృతిహాసన్ జంటగా నటిస్తున్నారు.  ఫృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు నటిస్తున్నారు. తమిళ నటి శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషించింది. 

 

click me!