చెప్పు తెగుద్ది అంటూ యాంకర్ నోరు మూయించిన 'బేబీ' హీరోయిన్..అడగకూడనిది అడుగుతూ ఓవర్ యాక్షన్, వైరల్ వీడియో 

Published : Jul 09, 2023, 02:23 PM IST
చెప్పు తెగుద్ది అంటూ యాంకర్ నోరు మూయించిన 'బేబీ' హీరోయిన్..అడగకూడనిది అడుగుతూ ఓవర్ యాక్షన్, వైరల్ వీడియో 

సారాంశం

విజయ్ దేవరకొండ సోదరుడిగా చిత్ర పరిశ్రమలోకి ఆనంద్ దేవరకొండ అడుగు పెట్టాడు. వరుసగా చిన్న చిత్రాలు, ఓటిటి చిత్రాలు చేస్తున్నాడు కానీ తనదైన మార్క్ ప్రదర్శించలేదు. ఇంకా ఆనంద్ దేవరకొండ కి క్రేజ్ ఏర్పడేలా హిట్ పడలేదు.

విజయ్ దేవరకొండ సోదరుడిగా చిత్ర పరిశ్రమలోకి ఆనంద్ దేవరకొండ అడుగు పెట్టాడు. వరుసగా చిన్న చిత్రాలు, ఓటిటి చిత్రాలు చేస్తున్నాడు కానీ తనదైన మార్క్ ప్రదర్శించలేదు. ఇంకా ఆనంద్ దేవరకొండ కి క్రేజ్ ఏర్పడేలా హిట్ పడలేదు. యువ దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి,  విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'బేబీ'. 

జూలై 14న ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో ప్రమోషన్స్ మొదలయ్యాయి. టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో బేబీ చిత్రంపై పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న వైష్ణవి చైతన్య తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆసక్తికర సంఘటన జరిగింది. 

బేబీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్.. వైష్ణవి.. ముద్దు పెట్టుకుంటా అంటూ షాకిచ్చాడు. కొన్ని క్షణాల పాటు వైష్ణవికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీనితో అతడికి వైష్ణవి అంతే ఘాటుగా చెప్పు తెగుద్ది అంటూ బదులిచ్చింది. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 

ఇంతకీ ఆ యాంకర్ ఎవరో కాదు జర్నలిస్ట్ సురేష్ కొండేటి. ఇటీవల సురేష్ కొండేటి ప్రశ్నల పేరుతో సినిమా ఈవెంట్స్ లో అతి చేస్తున్నారు. ఆ మధ్యన హరీష్ శంకర్ కూడా సురేష్ కొండేటికి ఘాటు వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా అతడి వైఖరి మారలేదు. తాజాగా వైష్ణవితో బిహేవ్ చేసిన విధానంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 

బేబీ టీజర్ లో ఆనంద్ దేవరకొండ ముద్దు పెట్టుకుంటా అని అంటాడు. దీనితో వైష్ణవి చెప్పు తెగుద్ది అంటా అంటూ చాలా సరదాగా డైలాగ్ చెప్పింది. దాని గురించి ప్రశ్నించే క్రమంలో సురేష్ కొండేటి ఓవర్ యాక్షన్ చేస్తూ హీరోయిన్ తో ముద్దు పెట్టుకుంటా అని అనడం జరిగింది. హీరోయిన్ కాసేపు ఆలోచించుకుని టీజర్ లోని డైలాగ్ తోనే సమాధానం ఇచ్చింది. దీనితో సురేష్ కొండేటి ఓహో చెప్పుతో కొడతారా అంటూ కవర్ చేసుకున్నారు. ఇది ప్రమోషన్స్ లో భాగంగా జిమ్మిక్కు అని కొందరు అంటున్నప్పటికీ.. నెటిజన్లు మాత్రం సురేష్ కొండేటిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వవివిధరకాలుగా కామెంట్స్ చేస్తూ ఏకిపారేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: లవర్‌కి షాకిచ్చిన ఇమ్మాన్యుయెల్‌.. కప్‌ గెలిస్తే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా.. తనూజ ఆవేదన
Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ