
తమిళంతో పాటు.. తెలుగులో కూడా మంచి మార్కెట్ ను సాధించాడు నేచురల్ స్టార్ శివకార్తికేయన్. ఆయనకు టాలీవుడ్ నుంచి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో కూడా శివకార్తికేయన్ అంటే ఇష్టపడే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఇక ఆ ఇమేజ్ తో తన ప్రతీ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు యంగ్ హీరో. అంతే కాదు తెలుగులోడైరెక్ట్ సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నాడు తమిళ స్టార్.
ఇప్పటికే రెమో, డాక్టర్ లాంటి డబ్బింగ్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు శివ కార్తికేయన్. ఆయన నటిస్తున్న తాజా సినిమా మావీరన్. మడోనా అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో మహావీరుడు పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఈసినిమాలో మరో విషేశం ఏంటంటే.. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అరుణ్ విశ్వ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జూలై 14న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈసినిమా నుంచి వచ్చిన ట్రైలర్ తో పాటు అప్ డేట్స్ అన్నీ.. మహావీరుడిపై అంచనాలు పెంచేశాయి..
ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు హీరో శివకార్తికేయన్. ఆయన ఇంతకు ముందు హీరోయిన్ నందితా శ్వేతా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి కేబీఆర్ పార్క్‌లో మొక్కను నాటారు. ఈ సందర్భంగా శివకార్తికేయన్ మాట్లాడుతూ,మొక్కలు నాటడం అనేది మనందరి బాధ్యత. ఇది రాబోయే జనరేషన్ కు మనం అందించే కానుక అన్నారు. అందుకే అందరు బాధ్యతగా ఫీల్ అయ్యి.. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు.
అంతే కాదు తాను మొక్కలు నాటడంతో పాటు.. గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టడానికి ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో ఉపయోగ పడుతుంది అన్నారు. అంతే కాదు తాను మొక్కను నాటుతూ.. మరొకరికి ఈ ఛాలెంజ్ ను విసిరారు. తమిళ యంగ్ తరంగ్.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నట్టు ప్రకటించారు శివకార్తికేయన్.